యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) స్పీడ్ పెంచారు. గత ఏడాది (2023లో) ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగని, ఆయన ఖాళీగా లేరు. కొత్త కథలు వింటూ వరుసగా ఒక్కో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'మనమే' విడుదలకు రెడీ అవుతోంది. శర్వా బర్త్ డే సందర్భంగా మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమా ఓకే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శర్వా!
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాజి'తో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి గుర్తు ఉన్నారుగా? ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం 9000 కెఎంపీహెచ్' తీశారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా... రెండు డిఫరెంట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా ఏబీపీ దేశానికి తెలిసింది. హీరోగా శర్వానంద్ 38వ చిత్రమిది.
'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఏదీ తెలుగులో విడుదల కాలేదు. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన యాంథాలజీ ఫిల్మ్ 'పిట్ట కథలు'లో 'పింకీ'కి దర్శకత్వం వహించారు. హిందీలో విద్యుత్ జమాల్ హీరోగా 'ఐబీ 71' తీశారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా కొత్త సినిమా ప్లాన్ చేశారు.
Also Read: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ
పాన్ ఇండియా ప్రాజెక్టుగా శర్వా, సంకల్ప్ సినిమా!?
తెలుగులో శర్వానంద్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమాలు చేస్తారని ఆయనకు పేరు ఉంది. తమిళ ప్రేక్షకులకూ ఆయన తెలుసు. 'ఓకే ఒక జీవితం'తో విజయం అందుకున్నారు కూడా! సంకల్ప్ రెడ్డి తొలి సిఎంమా 'ఘాజి' తెలుగుతో పాటు హిందీలో విడుదలైంది. 'ఐబీ 71'తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. శర్వా, సంకల్ప్... ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేయబోయే సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: లవ్ గురు ఓటీటీ రిలీజ్... ఆ రెండు వేదికల్లో రానున్న విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి సినిమా
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న సినిమాల విషయానికి వస్తే... శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' చేశారు. అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆ తర్వాత 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది స్పోర్ట్స్ డ్రామా. ఆ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ సమర్పణలో విక్రమ్, ప్రమోద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కాకుండా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇంకో సినిమాకు సంతకం చేశారు. దానిని 'నారి నారి నడుమ మురారి' టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. వీటికి తోడు ఇప్పుడు సంకల్ప్ రెడ్డి సినిమా యాడ్ అయ్యింది.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?