రష్మిక... ఇప్పుడు సౌతిండియాను ఏలుతున్న హీరోయిన్. రష్మిక కేరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. లేటెస్టుగా చేసిన పుష్పలో అదే జోరు కనిపిస్తోంది. శ్రీవల్లిగా సామీ సామీ అంటూ పుష్పరాజ్ మనసునే కాదు... సౌతిండియా కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.
ఇప్పటికే పుష్ప సినిమాలో సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్పులతో యూత్ వెర్రెక్కిపోతుంటే.. ఆ సెగలను మరింత రగిలించేలా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. అదే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.
బ్లాక్ కలర్ టీ షర్ట్, పొట్టి ప్యాంట్ వేసుకొని సామీ పాటకు రష్మిక చేస్తున్న డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. పుష్ప సినిమాలోని సామీ పాట జనాల్లోకి బాగా వెళ్లింది.
చాలా మంది ఫ్యాన్స్ సామీ పాటకు డ్యాన్స్‌లు చేసి తమ సోషల్ మీడియా పోస్టుల్లో పెడుతున్నారు. చాలా మందికి రష్మికకు ట్యాగ్ చేస్తున్నారు. అలాంటి వారందర్నీ ఉత్సాహ పరిచేందుకు ఈ డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చిందీ పుష్ప సుందరి.
"చాలా రోజుల నుంచి మీరంతా చేస్తున్న రీల్స్ చూస్తున్నాను. ఆ పార్టీలో నేను కూడా జాయిన్ కావాలనుకుంటున్నాను. అందుకే ఈ డ్యాన్స్ చేశాను. మీరంతా మరిన్ని రీల్స్ చేసి ఈ పార్టీలో జాయన్ అవుతారని అనుకుంటున్నాను. "- రష్మిక
అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. మొదటి పార్టు డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది.
Also Read: మహేష్ మోకాలికి సర్జరీ... రెండు రోజుల్లో మూడు దేశాలు తిరిగారు!
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
Also Read: పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?
Also Read: సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి