Pawan Kalyan Wife Anna Lezhneva Gets Emotional: జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కొణిదెల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్‌ 12న బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌లో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆయన నేడు ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్‌ కళ్యాన్‌ అను నేను అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్‌తో స్టేడియం మారుమోగింది.


పదేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నిజమైన రోజు ఇది. దీంతో ఫ్యాన్స్‌ ఆనందోత్సాహంతో స్టేడియం మారుమోగింది. ఇక పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తుండగా అక్కడ మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుండగా అక్కడే ఉన్న ఆయన భార్య అన్నా లెజ్నెవా ఎమోషనల్‌ అయ్యారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆమె మొఖం ఆనందంతో వెలిగిపోయింది. భర్తను వీడియో తీస్తూ మురిసిపోయారు. పవన్‌ ప్రమాణం స్వీకారం చేస్తుండగా అన్నా లెజ్నెవా ఎమోషనల్‌ అయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటుంది. 



కాగా అన్నా లెజ్నెవా పవన్‌ కళ్యాణ్‌ మూడో భార్య అనే విషయం తెలిసిందే. విదేశియురాలైన ఆమెను తీన్‌మార్‌ మూవీ టైంలో పవన్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే 1997లో నందిని అనే పెళ్లి చేసుకున్నారు. ఇక బద్రి మూవీ టైంలో ఆ మూవీ హీరోయిన్‌ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి, కొంతకాలం డేటింగ్‌ కూడా చేశారుజ ఇక తర్వాత సహాజీవనం చేసిన పవన్‌  2007లో ఫస్ట్‌ భార్య నందినికి విడాకులు ఇచ్చి 2009లో రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు వీరికి అకిరాన నందన్‌, ఆద్యలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అన్నా లెజ్నెవాతో పరిచయం వల్ల 2012లో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి ఆమెను వివాహమాడారు. 






అలాగే ఆయన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఎమోషనల్‌ అయ్యారు. ప్రమాణ స్వీకారం టైంలో అక్కడే స్టేజ్‌పై కూర్చోని ఉన్న ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియో వైరల్‌ అవుతుంది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు 70 వేల మెజారిటీతో గెలుపొందారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలతో బరిలో దిగిన జనసేన భారీ విజయంతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.



ఇండియా చరిత్రలోనే లేని విధంగా వందశాతం గెలుపును కైవసం చేసుకున్నారు. కాగా గత (2019) ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆయన రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయా భవిష్యత్తే లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. అసలు పవన్‌ అసెంబ్లీలో అడుగుపెట్టడం కల అన్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా వెనకడుగు వేయకుండ పదేళ్లు పోరాటం చేసి భారీ విజయంతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు.



Also Read: 'కల్కి 2898 AD' బుజ్జిని కలుసుకున్న ఆనంద్‌ మహీంద్రా - ఆకట్టుకుంటున్న వీడియో