Dil Raju Daughter Hanshitha Reddy: ఏకంగా ఇంట్లో విగ్రహం పెట్టేసింది... 'దిల్' రాజు కూతురికి అమ్మంటే ఎంత ప్రేమో చూశారా?
ఫోటో చూశారా? ఆ విగ్రహంలో ఉన్న మహిళ ఎవరో గుర్తు పట్టారా? ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు మొదటి భార్య అనిత. కొన్నాళ్ల క్రితం గుండెపోటుతో అనిత మరణించిన సంగతి తెలిసిందే. (Image Courtesy: hanshithareddy / Instagram)
'దిల్' రాజు మొదటి భార్య అనిత భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, కుమార్తె హన్షితా రెడ్డి గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. అమ్మ అనిత అంటే హన్షితకు ఎంత ప్రేమ అంటే... ఏకంగా ఇంట్లో విగ్రహం పెట్టేశారు. (Image Courtesy: hanshithareddy / Instagram)
మదర్స్ డే సందర్భంగా తన తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు హన్షితా రెడ్డి. ఫోటోలో హన్షిత కుమార్తె, దిల్ రాజు మనవరాలిని కూడా చూడొచ్చు. (Image Courtesy: hanshithareddy / Instagram)
తల్లి విగ్రహంతో దిల్ రాజు కుమార్తె అనిత (Image Courtesy: hanshithareddy / Instagram)
అమ్మమ్మ విగ్రహంతో హన్షిత కుమార్తె ఇషితా (Image Courtesy: hanshithareddy / Instagram)