ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నటుల్లో రాగ్ మయూర్  (Rag Mayur) ఒకరు. తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 'సినిమా బండి'లో చేసిన మరిడేష్ బాబు రోల్ ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు సమంత నిర్మించిన 'శుభం' సినిమాలో మరోసారి మరిడేష్ బాబు పాత్రలో సందడి చేశారు. ఆయన నటనకు, ఆ పాత్రకు మరోసారి అప్రిసియేషన్ లభించింది. అయితే... నెక్స్ట్ ఆయన చేతిలో ఏం సినిమాలు ఉన్నాయో తెలుసా?

'పరదా' సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్!'సివ‌రాప‌ల్లి' వెబ్ సిరీస్‌తో ఇటీవల మెయిన్ లీడ్‌గా స‌క్సెస్ అందుకున్నారు రాగ్ మయూర్. అలాగే, 'గాంధీ తాత చెట్టు'లో ఆయన పాత్రకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటికప్పుడు వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ త‌న‌ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. 

'శుభం'లో తన పాత్ర‌కు వస్తున్న స్పంద‌న గురించి రాగ్ మ‌యూర్ మాట్లాడుతూ... ''ఇంత‌కు ముందు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో నేను చేసిన 'సినిమా బండి' ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్రేక్షకులు అంద‌రికీ తెలిసిందే. అందులో నేను నటించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌ను 'శుభం'లోనూ దర్శకుడు కంటిన్యూ చేశారు. ప్ర‌వీణ్ ఈ సినిమా క‌థ నెరేట్ చేశాక నా పాత్రలోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం చేయ‌టానికి  వెంటనే ఓకే చెప్పా. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన స‌మంత‌ గారికి, ప్ర‌వీణ్‌ గారికి థాంక్స్‌'' అని చెప్పారు.

Also Readమృణాల్ ఠాకూర్‌తో పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో... మరాఠీ అమ్మాయి తెలుగింటి కోడలు కాదా?

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా 'పరదా'లో రాగ్ మ‌యూర్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి ఆయన న‌టిస్తున్నారు. ఆ సినిమా గురించి రాగ్ మయూర్ మాట్లాడుతూ... ''పరదా'లో నా పాత్ర రూప‌క‌ల్ప‌న‌, తెర‌కెక్కించిన తీరు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అదొక సోష‌ల్ డ్రామా. ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తుంది'' అని అన్నారు.

మరో రెండు సినిమాల్లోనూ రాగ్ మయూర్!Rag Mayur Upcoming Telugu Movies: 'పరదా' కాకుండా రాగ్ మయూర్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. జీఏ2 పిక్చర్స్ నిర్మాణంలో బ‌డ్డీ కామెడీ సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న 'గ‌రివిడి ల‌క్ష్మి' సినిమాలోనూ ఆయన ప్రధాన పాత్ర చేస్తున్నారు. ''భిన్నమైన పాత్రల్లో నటించడం నటుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం వల్ల న‌టుడిగా మ‌రింత స్కోప్ పెరుగుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తుండటం వల్ల నిర్మాణంపై అవ‌గాహ‌న క‌లుగుతోంది. అద్భుత‌మైన, పేరున్న టెక్నీషియ‌న్లతో ప‌ని చేస్తుండటం వ‌ల్ల న‌టుడిగా నాలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం క‌లుగుతోంది'' అని చెప్పారు.

Also Readబికినీలో రమ్య పసుపులేటి... థాయ్‌లాండ్‌లో తెలుగమ్మాయ్ షికార్లు చూశారా?