Harshavardhan Rane Refuse To Act With Actress Mawra Hocane: శత్రు దేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక చర్యకు దేశమంతా జేజేలు పలుకుతోంది. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సైనికులకు సెల్యూట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో కొందరు పాక్ యాక్టర్స్ 'ఆపరేషన్ సింధూర్'పై విమర్శలు చేశారు.

ఆ హీరోయిన్‌తో సినిమా చేయనన్న హీరో

ఇదే సమయంలో పాక్ హీరోయిన్ మావ్రా హోకేన్ 'ఆపరేషన్ సింధూర్'ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై బాలీవుడ్ హీరో హర్షవర్థన్ రాణే తీవ్రంగా స్పందించారు. ఆ హీరోయిన్‌తో సినిమా చేయనని ప్రకటించారు. హిట్ మూవీ 'సనమ్ తేరీ కసమ్' సీక్వెల్‌లో ఆమె ఉంటే ఆ సినిమా చేసేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. అలాగే.. దేశానికి మద్దతు పలకడం మంచిదే కానీ.. పక్క దేశంపై విషపూరిత కామెంట్స్ చేయడం సరికాదంటూ సదరు హీరోయిన్‌కు కౌంటర్ ఇచ్చారు.

'పరిస్థితులను నేను గౌరవిస్తున్నా. నా దేశాన్ని ఉద్దేశించి కొంతమంది కామెంట్స్ చేసిన తరుణంలో నేను ఓ నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వారే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్'లోనూ యాక్ట్ చేస్తే అందులో నేను యాక్ట్ చేయాలనుకోవడం లేదు.' అంటూ హర్షవర్ధన్ రాసుకొచ్చారు.

Also Read: ఇళయారాజా కుమారుడు యువన్ శంకర్ ఫస్ట్ తెలుగు పాట - 'షష్టి పూర్తి' నుంచి రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!

సూపర్ హిట్ మూవీ సీక్వెల్ డౌటేనా..

అయితే.. హర్షవర్ధన్, మావ్రా హోకేన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సనమ్ తేరీ కసమ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.  ఈ మూవీతోనే మావ్రా హోకేన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాధికా రావు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా 2016లో రిలీజై రూ.16 కోట్ల వసూళ్లు సాధించింది. ఇటీవలే రీ రిలీజ్‌లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రూ.41 కోట్ల కలెక్షన్లతో రీ రిలీజెస్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ మూవీకి హిమేష్ రేషమ్మియా సంగీతం అందించారు.

సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ మూవీకి సీక్వెల్ రూపొందించనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. మరి హర్షవర్ధన్ ప్రకటనతో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు.. హర్షవర్ధన్ నిర్ణయంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హీరోయిన్‌తో కలిసి నటించకూడదంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అటు.. పాక్ యాక్టర్స్ మూవీస్, ఇన్ స్టా అకౌంట్స్, యూట్యూబ్ ఛానళ్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

నా దేశంపై కామెంట్ చేస్తే సహించను

మావ్రా హోకేన్ పోస్ట్ షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటులనైనా తాను గౌరవిస్తానని.. కానీ నా దేశాన్ని ఎవరైనా చులకనగా మాట్లాడితే ఏ మాత్రం సహించనని అన్నారు. 'ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గినా పర్వాలేదు కానీ దేశ గౌరవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తే ఊరుకోను. నీ దేశానికి మద్దతుగా నిలబడడం మంచిదే. కానీ పక్క దేశాలపై విషపూరిత కామెంట్స్ చేయడం ఏమాత్రం సరికాదు.' అంటూ హితవు పలికారు.