Yuvan Shankar Raja's First Telugu Song From Shashtipoorthi  Movie: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అంటే ఆ క్రేజే వేరు. తండ్రి బాటలో నడిచి మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు యువన్ శంకర్ రాజ్. సింగర్‌గానూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌తో అలరించారు. 

తెలుగులో ఫస్ట్ సాంగ్

తాజాగా ఆయన తెలుగులో తన ఫస్ట్ సాంగ్ పాడారు. ఇళయరాజా (Ilaiyaraaja) మ్యూజిక్ అందిస్తోన్న 'షష్టి పూర్తి' సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను ఆయన పాడారు. 'రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే , నీ మాటే నచ్చే – మది మరుమల్లై విచ్చే..' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ మూవీ టీం తాజాగా రిలీజ్ చేయగా యూత్‌ను ఆకట్టుకుంటోంది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా , నిత్య శ్రీ ఆలపించారు. జంగ్లీ మ్యూజిక్ సంస్థ ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది.

తమ సినిమా కోసం యువన్ శంకర్ రాజా ఫస్ట్ టైం తెలుగులో పాట పాడడం ఆనందంగా ఉందని 'షష్టి పూర్తి' దర్శక నిర్మాతలు అన్నారు. సరిగ్గా మూవీ ఓపెనింగ్ జరిగిన రోజే ఇళయరాజా ట్యూన్ ఇచ్చారని.. ఈ పాట మూడ్‌కు యువన్ శంకర్ రాజా పర్ఫెక్ట్ అని అనుకున్నట్లు తెలిపారు.

ఈ పాట ఫుల్ రొమాంటిక్ జోష్‌తో ఉంటుందని.. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే, ననఈ సినిమా మొత్తం మీద బాగా ఖర్చు పెట్టి తీసిన పాట ఇదేనని చెప్పారు. 'మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కూల్ సాంగ్. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను కూడా ఈ ‘షష్టిపూర్తి‘ టీమ్‌లో భాగమైనందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ' అని యువన్ శంకర్ తెలిపారు. 

Also Read: 'సత్యం సుందరం' డైరెక్టర్‌కు సూర్య, కార్తి కారు గిఫ్ట్ - భలే సర్ ప్రైజ్ ఇచ్చారుగా..

ఈ నెల 30న మూవీ రిలీజ్

రూపేష్ హీరోగా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న 'షష్టి పూర్తి' మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తుండగా.. MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నటకిరీటీ రాజేంద్రప్రసాద్, అలనాటి హీరోయిన్ అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పటి క్లాసిక్ హిట్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్లకు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. కాంతారా' ఫేమ అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, మురళీధర్ గౌడ్, చలాకి చంటి, బలగం సంజయ్, మహిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఫస్ట్ సాంగ్ 'ఏదో ఏ జన్మలోదో' పాటకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి లిరిక్స్ అందించారు. ఇప్పుడు మూడో సాంగ్ సైతం ఆకట్టుకుంటోంది.