Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా సోషియో ఫాంటసీ ఆడ్వెంచర్ యాక్షన్ మూవీ 'విశ్వంభర'. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హిరోయిన్ గా నటిస్తోంది. భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ సెట్స్ కు మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు విచ్చేశారు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించారు.
'విశ్వంభర' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతలలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, త్రిషతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. అయితే సోమవారం ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబులు షూటింగ్ లొకేషన్ కు వెళ్లి తమ అన్నయ్యను కలిశారు. చిరు తన ఇద్దరు తమ్ముళ్ళను సాదరంగా ఆహ్వానించారు. చిత్ర బృంద అంతా కలిసి ఫోటోలు దిగారు.
ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు 'విశ్వంభర' సెట్స్‌లో కలుసుకున్న విషయాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు శ్రీ క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'పవర్ స్టార్ విశ్వంభర లోకాన్ని సందర్శించారు' అంటూ మెగా బ్రదర్స్ మీటింగ్ కు సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో చిరు షాట్ కోసం రెడీ అవుతుండగా.. పవన్ కల్యాణ్ తన కారు దిగి లోకేషన్ లో అడుగుపెట్టడం, అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, సెట్స్ లో కూర్చొని కాసేపు ముచ్చటించడం వంటి దృశ్యాలను మనం చూడొచ్చు.
Also Read: ఎన్టీఆర్ నోట పవన్ కళ్యాణ్ డైలాగ్స్ - పోలా.. అదిరిపోలా!
ఇలా చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. ఇది వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అందుకే లైక్స్, కామెంట్స్ తో ఈ ఫోటోలు, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ లో పెద్ద హనుమాన్ విగ్రహం, హీరోయిన్ త్రిష ఫేస్ కు గాయాలు ఉండటాన్ని బట్టి చూస్తే.. భారీ ఫైట్ ను షూట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ అనే టాక్ ఉంది. దీని కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ అధ్బుతమైన సెట్ ను నిర్మించారని తెలుస్తోంది.
పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తునారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా పని చేస్తున్నారు. ఈ మెగా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Also Read: ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే బెటరేమో!