Nagabandham Title Glimpse: ‘నాగబంధం’ టైటిల్ గ్లింప్స్ - ఆ రహస్యాన్ని కనిపెట్టేది ఎవరు? హీరో లేకుండానే.. మూవీ?

Nagabandham: రహస్యాలను కనిపెట్టడం, వాటికి మైథరాజికల్ టచ్ ఇవ్వడం లాంటి కథలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువశాతం హిట్స్ సాధిస్తాయి. తాజాగా అలాంటి ఒక మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది. అదే ‘నాగబంధం’.

Continues below advertisement

Nagabandham The Secret Treasure Title Glimpse Is Out Now: ఈరోజుల్లో మైథలాజికల్ సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తున్నాయి. కథను సరిగా ప్లాన్ చేసుకుంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు కూడా మంచి లాభాలను రాబడుతున్నాయి. టాలీవుడ్‌లో మైథలాజికల్ చిత్రాల హవా కొనసాగుతుండగా.. ఆ లిస్ట్‌లోకి మరో మూవీ యాడ్ అవ్వనుంది. అదే ‘నాగబంధం’. అసలు ఈ నాగబంధం అంటే ఏంటి, నాగబంధం వెనుక ద్వారంలో ఏముంది? లాంటి విషయాలను రివీల్ చేయకుండా టైటిట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్‌లోనే ఓ రేంజ్ విజువల్స్‌ను చూపించింది టీమ్.

Continues below advertisement

దర్శకుడిగా మారి..

ఇప్పటివరకు టాలీవుడ్‌లో నిర్మాతగా పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్ నామా.. దర్శకత్వం వహిస్తున్న చిత్రమే ‘నాగబంధం’. ఈ మూవీకి అభిషేక్.. డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా స్టోరీని కూడా తనే రాసుకున్నారు. దేవాన్ష్ నామా సమర్పిస్తున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై మధుసూదన్ రావు నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో పాటు థండర్ స్టూడియోస్ బ్యానర్‌ కూడా ‘నాగబంధం’ చిత్ర నిర్మాణంలో పాల్గోనుంది. ఇప్పటికే విడుదలయిన టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీని భారీ ఎత్తులో నిర్మించనున్నారని అర్థమవుతోంది. ఈ గ్లింప్స్‌లో ఒక అఘోర పాత్ర ఉంది కానీ ఇందులో హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.

పాముల మధ్యలో తపస్సు..

‘నాగబంధం’ టైటిల్ గ్లింప్స్ ఓపెన్ అవ్వగానే ముందుగా మంచు పర్వతాలు, ఆపై దట్టమైన అడవి కనిపిస్తాయి. ఇక ఆ అడవి మధ్యలో ఒక గుహ. లోపలికి వెళ్తే అంతా చీకటి. బయట నుంచి చూడడానికి చిన్నగా కనిపించినా.. గుహ లోపల చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఎక్కువగా పాముకు సంబంధించిన విగ్రహాలే కనిపిస్తుంటాయి. అందులోనే విష్ణు మూర్తి విగ్రహం ఉంటుంది. మరోవైపు ఆ గుహలో చాలా పాములు తిరుగుతుంటాయి. పాములు తనపై నుంచి వెళ్తున్నా పట్టించుకోకుండా ఒక అఘోర అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన కళ్ల ఎదురుగా ‘నాగబంధం’ ఉంటుంది. అప్పుడే టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీకి ‘ది సీక్రెట్ ట్రెషర్’ అని ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు.

సంగీతమే హైలెట్..

‘నాగబంధం’ టైటిల్ గ్లింప్స్‌లో విజువల్స్, మ్యూజిక్ హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాపై ఇంట్రెస్ట్‌ను ఆ మ్యూజిక్‌తో మరింత పెంచాడు సంగీత దర్శకుడు అభి. ఇప్పటికి ఇది ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మాత్రమే మేకర్స్ ప్రకటించారు. ఇందులో నటీనటులు ఎవరు లాంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ ఒక్క టైటిల్ గ్లింప్స్‌తోనే అసలు ‘నాగబంధం’ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. 2025లో ఈ రహస్యం ఏంటో బయటపడుతుంది అంటూ సోషల్ మీడియాలో దీని రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీ టీమ్. తెలుగుతో పాటు పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ‘నాగబంధం’ విడుదల కానుందని తెలుస్తోంది.

Also Read: మహేష్ బాబు మూవీలో అమీర్ ఖాన్? గట్టిగానే ప్లాన్ చేస్తున్నావుగా జక్కన్న!

Continues below advertisement
Sponsored Links by Taboola