Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకొని బాధ పడుతుంది. గాయత్రీ కోపం గురించి చెప్పి తాతయ్య దగ్గర బాధ పడుతుంది. వాసుకి చెంప పగలగొట్టిందని ఈ రోజు వాళ్లతో గొడవ పడిందని చెప్తుంది. దానికి తాతయ్య దానికి నువ్వు అంటే ఇష్టం కదమ్మా నిన్ను ఎవరు ఏమన్నా ఊరుకోదని అంటారు. 

Continues below advertisement


గాయత్రీకి అన్ని విషయాలు వివరంగా చెప్పమని అంటారు. నీ మాట వింటుందని త్రిపురతో చెప్తారు. వెళ్లి మాట్లాడుతానని చెప్తుంది. ఇక తాతగారు కార్యం గురించి త్రిపురతో చెప్తారు. అది జరిగితే ఒకరికి ఒకరు అండగా నిల్చొంటారని అంటారు. అదంతా విన్న రమాప్రభ, ఊర్వశిలు గాయత్రీ వీక్ నెస్నే కోపం అని అది బట్టలు సర్దుకొని వచ్చే వరకు మనం వదలం ఆ వాసుకి వాళ్లు వదలరని అనుకుంటారు. 


అనంత్: గాయత్రీ బాధ పడుతూ ఉంటే చేయాల్సింది అంతా చేసి ఎవరి మీద అలుగుతున్నావ్. మా వాళ్లు మీ అక్కని టార్గెట్ చేశారని అంటున్నావ్ ఓకే కానీ అది తెలిసి నువ్వు ఎందుకు ట్రిగర్ అవుతున్నావ్ నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావ్. నువ్వు కోపం తగ్గించుకొని అడగొచ్చు కదా.
గాయత్రీ: నేను చేసింది మీకు లెక్క కానీ మీ  వాళ్లు ఏం చేశారో మీకు లెక్క లేదా. 
అనంత్: గాయత్రీ నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో లేవు నీకు నచ్చినట్లు ఉండటానికి ఇది మీ ఇళ్లు కాదు. ఈ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు రకాలుగా ఉంటారు. నువ్వు కోపం తగ్గించుకోవాలి అవసరం అయితే అణిగిమణిగి ఉండాలి. అందరికీ తగ్గట్టు ఉండాలి.
గాయత్రీ: నా మాటలు నా ప్రవర్తన మీకు నచ్చడం లేదు కదా. మీ అందరి కోసం నేను బానిసలా మారాలి అంతేనా. 
అనంత్: ఏదైనా ఆలోచించి చేయమంటున్నాను.
గాయత్రీ: మా అక్కని అవమానించినా చూస్తూ ఉండాలా.
అనంత్: నువ్వు ఇంక మారవు.
బాల: అనంత్ కోపంగా వెళ్లిపోతే బాల గాయత్రీ దగ్గరకు భోజనం తీసుకొని వస్తాడు. గాయత్రీ ఎందుకు ఏడుస్తున్నావ్ నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అనంత్ నీ మీద కోప్పడ్డాడా. ఉండు నేను అనంత్ సంగతి చెప్తా. ఓరేయ్ అనంత్ రారా. అనంత్ గాయత్రీకి సారీ చెప్పు నువ్వు చెప్పకపోతే నేను నీతో మాట్లాడను.
అనంత్: సరే గాయత్రీ రియల్లీ సారీ.
బాల: అనంతూ గాయత్రీ మీరు ఇద్దరూ భార్యభర్తలు అంటే మీరు ఒకే మాట మీద ఉండాలంట. అచ్చం సీతారాముల్లా. నాకు సుందరి చెప్పింది.  అనంతూ గాయత్రీ డిన్నర్ చేయలేదు నువ్వు తినిపించు. గాయత్రీ నువ్వు మంచిగా భోజనం చేయ్. అనంత్ గాయత్రీకి గోరు ముద్దలు తినిపిస్తాడు. 


త్రిపుర ఉదయం బౌద్ధాశ్రమానికి వెళ్తుంది. బౌద్ద గురువుని కలిసి బాల గురించి చెప్పి సాయం చేయమని కోరుతుంది. మేం వైద్యం చేస్తాం పూర్తిగా మాములు మనిషి అవ్వరు కానీ కొన్ని గంటలు మామూలుగా మారి తర్వాత చిన్న పిల్లాడిలా మారిపోతారు అని చెప్తారు. పూర్తిగా మామూలు మనిషి అవ్వరా అని త్రిపుర అడిగితే అలా జరగడం అరుదు అని చెప్తారు. త్రిపుర మనసులో బాలగారిని మామూలు మనిషిని చేసి ముందు తాతయ్య విషయంలో జరిగిన నిజం తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఈ ప్రక్రియ గురించి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చెప్పమని త్రిపుర చెప్తుంది. బౌద్ధ గురువు త్రిపురతో పాటు బాల ఇంటికి వస్తారు. 


త్రిపుర రావడం చూసి ఎవరినో తీసుకొస్తుందని వాసుకి, నాగభూషణం కంగారు పడతారు. త్రిపుర వాళ్ల గురించి ఇంట్లో చెప్తుంది. బామ్మ సంతోషంగా ఫీలవుతుంది. డబ్బు కోసమే త్రిపుర ఇదంతా చేస్తుందని వాసుకి వాళ్లు నింద వేస్తారు. అందరూ మా అక్కని డబ్బు మనిషిగా చూస్తున్నారు కానీ నీ తపన ఎవరూ చూడటం లేదని గాయత్రీ అంటుంది. అనంత్ ఆపి త్రిపుర గారు మా మాత్రం అయినా చేస్తున్నారు మనం అది కూడా చేయడం లేదని అంటాడు. బామ్మ వాసుకి వాళ్లని ఆపుతుంది. బాల వచ్చి బుద్ధం శరణం గచ్ఛామి అని పాడుతూ గురువుగారి కాళ్లకి దండం పెడతాడు. వాళ్లని నాగభూషణం వెళ్లిపోమంటే త్రిపుర వాళ్లని బతిమాలి తీసుకొచ్చా అని అంటుంది. ఒక అవకాశం ఇవ్వమని త్రిపుర అంటుంది. నా కొడుకు మామూలు మనిషి అవుతాడు అంటే నేను అడ్డు చెప్పను అని యశోద అంటుంది. ఇక బామ్మ ఎవరూ త్రిపురని ఆపొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!