Seethe Ramudi Katnam Serial Today Episode సీత డిటెక్టివ్ అవతారం ఎత్తి రామ్ గదికి వచ్చి వెతుకుతుంది. నా రూంలో ఏం వెతుకుతున్నావ్ అని రామ్ అడిగితే ఇళ్లంతా పరిశీలిస్తేనే ఏదైనా ఆధారం దొరుకుతుందని అంటుంది. మహాలక్ష్మీ, అర్చనలు సీతని ఫాలో అవుతారు. గౌతమ్ గదిలో వెతికితే ఏమైనా ఆధారాలు దొరికితే కష్టం అని అర్చన అంటుంది. గౌతమ్ ఏం ఆధారాలు ఉంచుకోడని మహాలక్ష్మీ అంటుంది.
రామ్ రూంలో ఏం దొరకలేదని సీత అంటుంది. ఇక రామ్ సీతని నోరు మూసుకొని ఇక్కడి నుంచి పద అని లాక్కొని కిందకి తీసుకెళ్తాడు. మహాలక్ష్మీతో పాటు అందరూ సీత కావాలనే డ్రామా చేస్తుందని ఆధారాలు లేవు ఏం లేవని అంటారు. ఇక సీత తన దగ్గర ఆధారాలు ఉన్నాయని హంతకుడు సుమితి మీద దాడి చేయడానికి ముందు ఏం జరిగిందో సీసీ టీవీ ఫుటేజ్‌లో తెలుస్తుందని పెన్ డ్రైవ్ తీసుకొచ్చి రామ్‌కి ఇస్తుంది. రామ్ దాన్ని టీవీకి కనెక్ట్ చేస్తాడు. విద్యాదేవిని గౌతమ్ అమ్మవారి వేషంలో తరుముకుంటూ వచ్చినట్లు అందులో ఉంటుంది.
సీత అందరితో అత్తమ్మ హంతకుడిని వెంట పడి పొడిచి పారిపోయాడని అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అత్తమ్మని కాపాడటానికి కడుపులో దిగిన కత్తి నేనే తీస్తే మీరంతా నన్ను అత్తమ్మని చంపిన హంతకుడు అని అన్నారని అంటుంది. నేను పొడవ లేదు అని అత్తమ్మ చెప్పాలి అనుకొని నా పేరు చెప్పేలోపు ప్రాణం పోయిందని సీత అంటుంది. ఇంట్లో ఆ రోజు ఫుటేజ్ లేదని వేరే దగ్గర వెతికితే దొరుకుతుంది అది కూడా త్వరలోనే తీసుకొస్తా అని సీత అంటుంది. దానికి మహాలక్ష్మీ సీతతో ఇలా చేసి చెప్పి తప్పించుకోమని మీ నాన్న చెప్పారా అని అంటారు. సీతకు అంత అవసరం లేదని రామ్ అంటాడు. సీత తన తల్లిని చంపాలని ప్రయత్నించలేదని అంటాడు. ఇక సీత త్వరలోనే హంతకుడిని పట్టుకుంటానని ఛాలెంజ్ చేస్తుంది. సీత మాటలకు అటు మహాలక్ష్మీ ఇటు గౌతమ్ ఇద్దరూ చెమటలు పట్టేస్తారు.
సీత వెళ్లిపోతుంటే రామ్ ఆపుతాడు. కంగ్రాట్స్ చెప్తాడు. మంచి పాయింట్ తీసుకొచ్చావ్ కీప్ ఇట్ అప్ అని చెప్తాడు. మాటలు వద్దు ఇంకేమైనా కావాలా అంటుంది. ఫీజ్ కావాలా అని రామ్ అడిగితే కాదు అని హగ్ కావాలని అంటుంది. అదంతా చూసిన అర్చన మహాలక్ష్మీతో పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తున్నారు ఎవరు చూస్తారు అనే భయం కూడా లేదు రామ్ నీ మాట వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ వినడం లేదని అర్చన మహాలక్ష్మీతో చెప్తుంది. సీత గౌతమ్‌ని పట్టుకోవడం ఖాయం అనిపిస్తుందని అంటుంది. అదే జరిగితే సీతని గౌతమ్ జాతర చేస్తాడని మహాలక్ష్మీ అంటుంది. నీ కేం అవసరం వచ్చినా నన్ను అడుగు అని రామ్ సీతతో చెప్తాడు.
గౌతమ్ సీతని తక్కువ అంచనా వేశాను దాదాపు నా దగ్గరకు వచ్చిందని అనుకుంటాడు. ఇంతలో రేఖ వచ్చి గౌతమ్ మీద చేయి వేయడంతో గౌతమ్ కంగారు పడతారు. నువ్వు చేసిన జాతరతో సీత నీ దగ్గరకు వచ్చేసింది ఆ సుమతిని చంపింది నువ్వే అని నాకు అర్థమైందని అంటుంది. మహాలక్ష్మీ వచ్చి రేఖని తిడుతుంది. గౌతమ్ మీ కొడుకు అని నాకు తెలుసు అని రేఖ అంటుంది. సీత మీద చేసిన అటాక్‌లు గురించి కూడా గౌతమ్ చెప్పాడని ఈ ఇంట్లో జరిగే ప్రతీది తనకు తెలుసు అని అన్నీ తాను చెప్పాడని అంటుంది. ఇన్ని తెలిసి నువ్వు వీడిని ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని అర్చన అంటే మీతో కలిసిపోతా అత్తయ్య నా తెలివిని వాడుకోండి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!