Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను దేవయానికి జ్యూస్ ఇవ్వడానికి వెళ్తుంది. వివేక్ నువ్వేంటి మా అమ్మకి జ్యూస్ తీసుకెళ్తున్నావు అంటే ఒక నిజం చెప్పించాలి అని అంటుంది. మనీషా కొట్టిన కొట్టుడుకి మనీషాని దేవయాని తిట్టుకుంటుంది. జాను దేవయానితో మనీషా మీదకు రెచ్చగొడుతుంది. మనీషా తన మెడలో తాళి చూసుకొని రెచ్చిపోతుందని ఆ తాళిని అడ్డు పెట్టుకొని ఎవరినో తన్ని తరిమేస్తానని శపథం చేసిందని చెప్తుంది. మా అక్కని అనింది అనుకున్నా కానీ మిమల్నే అన్నది. మిమల్ని తన్ని తరిమేస్తానని అంటుందని జాను చెప్తుంది. 

దేవయాని జానుతో అది నన్ను తరిమేయడం ఏంటి నేనే దాన్ని తరిమేస్తా అని జాను దగ్గరకు వెళ్లి మనీషాని తిడుతుంది. ఆ తాళి చూసుకొనే కదా నీకు అంత పొగరు నేను లేకపోతే నీకు ఆ తాళి ఎలా వచ్చేదే అని దేవయాని అంటుంది. దానికి మనీషా మీరే దగ్గరుండి మిత్రతో నాకు తాళి కట్టించినట్లు అంటారేంటి అంటుంది. మిత్ర నీ మెడలో తాళి కట్టడం ఏంటే నువ్వే తాళి కట్టుకొని నాటకం ఆడుతున్నావ్ అని అంటుంది. దేవయాని మాటలకు మనీషా షాక్ అయిపోతుంది. ఈ ఇంట్లో నువ్వుంటావో నేను ఉంటానో తేల్చుకుందామని దేవయాని మనీషాతో అంటుంది. గట్టిగా అరవకండి నా కొంప ముంచకండి అని మనీషా అంటే కొంపలు ముంచడానికే నువ్వు వచ్చావే నీ వల్ల మిత్ర, లక్ష్మీ జాను వివేక్లు విడిపోయే వాళ్లే అని దేవయాని గొడవ పడుతుంది. జాను, వివేక్‌లు నిజాలన్నీ బయటకు వస్తున్నాయని నవ్వుకుంటారు. లక్ష్మీ కూడా అక్కడికి వస్తుంది.

దేవయాని మనీషాతో సరయు ఉన్నంత వరకే నువ్వు ఉంటావ్ దాని దగ్గర నీ బండారం బయట పడితే  ఇక అంతే అని మనీషా మెడలో తాళి తెంపి పడేస్తుంది. నీ దిక్కున్న చోట చెప్పుకో అని అంటుంది. దేవయాని విసిరిన తాళి లక్ష్మీ కాళి దగ్గరకు వస్తుంది. లక్ష్మీ తాళి తీసి ఏంటి మనీషా నువ్వు కట్టుకున్న తాళి పడిపోయిందని అంటుంది. నీ బండారం మొత్తం బయట పడిపోయిందని మొత్తం మేం విన్నాం చూశాం అని వివేక్, జానులు అంటారు. అరవింద వచ్చి ఏమైందని అడుగుతుంది. నా తాళి తెగిందని మనీషా ఏడుస్తుంది. పంతులు తాళి పెరగడం వల్ల తాళి కట్టిన భర్తకి అపశకునం అని ప్రాణ గండం అంటారు. అరవింద భయపడి ఏం చేద్దాం అని పంతుల్ని అడిగితే మంగళగౌరి వ్రతం చేసి మళ్లీ తాళి కట్టించాలి అంటారు. అది కట్టుకున్న తాళి అని లక్ష్మీ అంటే అరవింద ఆపి హోమం కంటే ముందే మిత్రతో మనీషాకి తాళి కట్టిద్దామని అంటారు. మనీషా లక్ష్మీతో మిత్ర నా ప్రాణం తనకు ఏమైనా అయితే నా ప్రాణం అడ్డేస్తా అంటుంది. 

మనీషా సరయు బ్యాంక్ అకౌంట్ నింపేస్తుంది. తన సీక్రెట్స్ అన్నీ బయటకు రాకూడదు అని చెప్తుంది. మిత్ర తన మెడలో రేపు తాళి కడతాడు అని లక్కీ మన చేతిలో ఉండాలి అని అప్పుడు లక్ష్మీ మనం ఆడమన్నట్లు ఆడుతుందని అంటుంది. కిడ్నాప్ చేసేద్దామని సరయు అంటుంది. ఇక దేవయాని పాముల ఆవిడ మందు తాగి దేవయాని మనకు యాంటీ అయిపోయిందని చెప్తుంది. దాంతో సరయు దేవయాని కోసం విరుగుడు ముందు ఇస్తుంది. అది తాగితే దేవయాని మామూలుగా అయిపోతుందని అంటుంది. 

వివేక్ మిత్రతో ఈ రోజు మన ఇంట్లో హోమం మాత్రమే జరగాలి అని అంటాడు. అమ్మని కాదని ఏం చేయలేం కాబట్టి నిజం తెలుసుకోవాలని మిత్ర అంటాడు. దానికి లక్ష్మీ సరయుకే నిజాలు తెలుసు అని సరయు పీఏ ద్వారా సరయు నోరు తెరిపించాలని ప్లాన్ చేస్తారు. ఇక మనీషా బెలూన్స్ మీద మిత్ర, మనీషా అని రాసి పిల్లలకు చూపిస్తుంది. పిల్లలు వాటిని తీసుకొని పేల్చేస్తారు. రోడ్డు మీద చాలా బెలూన్స్ ఎగరేస్తాను అని చెప్పి పిల్లల్ని రోడ్డు మీదకు పంపుతుంది. సరయు మనుషులు పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. సరయు లక్ష్మీకి కాల్ చేసి పిల్లల కిడ్నాప్ ఫోటో పంపిస్తుంది. పిల్లలు కావాలి అంటే పిల్లలు ఇంట్లో లేరని ఎవరికీ చెప్పకూడదు అని నువ్వు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతేనే పిల్లలు బతుకుతారని లేదంటే వాళ్లని చంపేస్తా అంటుంది. మనీషాని మిత్రకు ఇచ్చి పెళ్లి చేసి వస్తేనే పిల్లలు సేఫ్ లేదంటే పిల్లలు శాశ్వతంగా నిద్రలోకి పోతారని అంటుంది.  దాంతో లక్ష్మీ మనీషా దగ్గరకు వెళ్లి నా పిల్లలు ఎక్కడ అని అడుగుతుంది. మనీషాని కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!