How It Ends Movie Story: యుగాంతం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మీరూ ఆ జాన్రా ఇష్టపడే వారే అయితే, ఈ సినిమా మీకు నచ్చుతుంది. ‘హౌ ఇట్ ఎండ్స్’ (How It Ends) 2018లో విడుదలయిన అమేరికన్ యాక్షన్ థ్రిల్లర్. సినిమా చూస్తున్నంతసేపూ మనకు కోవిడ్ లాక్ డౌన్ అనుభవాలు గుర్తొస్తాయి. అసలు వారి పరిస్థితులకు కారణాలేవీ రివీల్ చేయకుండా అస్పష్టంగా సినిమా ముగించినప్పటికి.. ఒక రెండు గంటలు థ్రిల్లర్ మూవీలో మునిగిపోవాలనుకునే వారిని ఈ సినిమా నిరాశ పరచదు. 


కథ విషయానికొస్తే.. విల్, సమంతా (సామ్) రిలేషన్షిప్ లో ఉంటారు. సామ్ ప్రెగ్నెంట్ అవుతుంది. పెళ్లి గురించి మాట్లడటానికి విల్, సియాటెల్ నుంచి చికాగోలో ఉన్న సామ్ తల్లిదండ్రులను కలవటానికి బయలుదేరుతాడు. సామ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రి టామ్‌ను అనుమతి కోరాలి. డిన్నర్ చేసేపుడు, టామ్, విల్ మధ్య మాటామాటా పెరుగుతుంది. విల్ సామ్ ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పకుండానే వెళ్లిపోతాడు. 


ఆ తర్వాత రోజు, సామ్ విల్‌ కి కాల్ చేస్తుంది. ఫోన్ మాట్లాడుతుండగా ఒక వింత శబ్దం వినపడుతుంది. ఆమె చాలా భయపడిపోతుంది. లైన్ కట్ అయ్యే ముందు "ఏదో తప్పు జరిగింది" అంటుంది. ఫోన్లు పనిచేయకుండా పోతాయి. విల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరితే, అక్కడ అన్ని విమానాలు రద్దు అవుతాయి. ఎలక్రిసిటీ, టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగించిన ఒక భూకంప సంఘటనపై చర్చిస్తూ ఒక టీవీ వార్త కనిపిస్తుంది. విల్ సామ్ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వస్తాడు. అక్కడ టామ్ , విల్ కలిసి సామ్‌ను కనుగొనడానికి సీయాటెల్ కు బయలుదేరుతారు.


భారీ ట్రాఫిక్ కారణంగా సైనికులు రాకపోకలు నిలిపివేస్తారు. టాం మెరైన్ ఆఫీసర్ కావటంతో ముందుగానే పర్మీషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. దారిలో పోలిస్ కార్ వీళ్లను ఆపుతుంది. కానీ ఆ కారులో ఉన్నది పోలీసులు కాదు. ఒక పారిపోతున్న ఖైదీ. పెట్రోల్ కోసం వీళ్ల కారును ఆపుతాడు. వీళ్ల మధ్య చాలాసేపు గన్ ఫైట్ జరుగుతుంది. ఆ ఖైదీ టామ్‌ను డొక్కలో కాలుస్తాడు. టామ్ ఆ ఖైదీని కిందపడేస్తాడు. పాడయిపోయిన వాళ్ల కారును వదిలేసి, పోలీస్ కార్ తీసుకొని, దగ్గరున్న మెకానిక్ షాప్ కు వెళ్తారు. అక్కడో మెకానిక్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కారును బాగుచేస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో కార్ మళ్లీ బ్రేక్ డౌన్ అయితే కష్టం. నువ్వూ మాతో రావాలని ఆ మెకానిక్ ని కోరుతారు.


ఆమె కూడా వీళ్లతో వస్తుంది. దారిలో పెట్రోల్ కోసం ఆపి, ఫైట్ చేసేవారు వస్తారు. ఆ ఫైట్ లో విల్ వాళ్లను కాల్చి చంపేస్తాడు. ఇలా చిన్న చిన్న వస్తువుల కోసం చంపుకునే మనుషుల మధ్య నేను ఉండలేను అని ఆ మెకానిక్ రిక్కీ వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనేక యాక్షన్ సీన్స్ తర్వాత విల్ తన భార్యను చూస్తాడు. అపుడు కథ మళ్లీ మలుపులు తిరుగుతుంది. అసలు దేశంలో ఏం జరుగుతుంది.. అసలు ఏ గాడ్జెట్లు, ఇంటర్నెట్ ఎందుకు పనిచేయట్లేదు అనే సస్పెన్స్ అలా కొనసాగుతుంది. ఈ సినిమాకు రెండో పార్ట్ ఉందని అనౌన్స్ చేసారు. సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అనుక్షణం ఉత్కంఠగా ఈ మూవీ సాగుతుంది. ఎక్కడా మీకు బోరు కొట్టదు.



Also Read: పెళ్లి చేసుకున్న వెంటనే వధువును డ్రాగన్ గుహాలోకి వేసిరేస్తాడు - ఆ రాజు అలా ఎందుకు చేస్తాడు?