Jr. NTR: RRR తో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. అప్పటి నుంచీ 'దేవర' సినిమా షూటింగ్ కే పరిమితమైన తారక్.. అప్పుడప్పుడు ఇతర హీరోల సినీ ఈవెంట్స్ కు చీఫ్ గెస్టుగా వెళ్తూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'టిల్లు స్క్వేర్' మూవీ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, అక్కినేని నాగార్జున సినిమాలలోని డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. 


సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి ఎన్టీఆర్ తో పాటుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'అత్తారింటికి దారేది' సినిమాలోని పాపులర్ డైలాగ్ ను తారక్ తనదైన శైలిలో చెప్పి స్టేజ్ మీద నవ్వులు పూయించారు. పనిలో పనిగా 'కింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల్లో బ్రహ్మానందం డైలాగ్స్ కూడా చెప్పి, అక్కడున్న వారందరినీ నవ్వించారు. 


'దేవర' సినిమాలో భయం గురించి ఎక్కువ శాతం మాట్లాడటం జరుగుతుందని చెప్పిన ఎన్టీఆర్.. “కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి” అని అన్నారు. దీనికి అక్కడే ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో “కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి.. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్.. పోలె అదిరిపోలే” అని తారక్ సరదాగా నవ్వుతూ అన్నారు. దీంతో ఎన్టీఆర్ తన కామెడీ టైమింగ్ కి త్రివిక్రమ్ తో సహా స్టేజి మీదున్న మిగతా సెలబ్రిటీలు, కింద ఉన్న అభిమానులు విరగబడి నవ్వుకున్నారు.


Also Read: ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి: ఎన్టీఆర్


నిజానికి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించే తారక్.. నిజ జీవితంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ యంగ్ టైగర్ ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రం దీన్ని అంగీకరించరు. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ లో చాలా జోవియల్ గా ఉంటారు. తను నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ.. జోకులు వేస్తూ, తన కామెడీ టైమింగ్ తో చుట్టూ సందడి వాతావరణం ఏర్పడేలా చేస్తుంటారు. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ వేదికగా మీమ్స్ లో బాగా పాపులర్ అయిన డైలాగ్స్ ను పలికి, తనలోని కామెడీ టైమింగ్ ను మరోసారి అందరికీ చూపించారు. 


గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో నటించిన తారక్.. ఆ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనూ పవన్ కళ్యాణ్ డైలాగ్ ను పలికారు. 'అత్తారింటికి దారేది' క్లైమాక్స్‌లో వచ్చే 'కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనపడని యుద్దం చేస్తున్నా' అనే డైలాగ్ తారక్‌ నోట చెప్పి ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి త్రివిక్ర‌మ్ ముందే ఆయన డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ని చూసి చాలా రోజులైంది. ఆయనను స్టేజి మీద చూస్తుంటే 'అరవింద సమేత' రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


ఇకపోతే RRR తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకి కమిట్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందని అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లుగా నిర్మాత నాగవంశీ ప్రకటించారు. దీంతో తారక్ వెంటనే కొరటాల శివతో 'దేవర' మూవీని అనౌన్స్ చెయ్యగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చిత్రాన్ని ప్రారంభించారు త్రివిక్రమ్. అప్పటి నుంచీ వీరిద్దరూ మళ్ళీ కలిసి కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే రూమర్స్ వచ్చాయి. అయితే దర్శక హీరోలు ఇన్నాళ్లకు 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరి మీద ఒకరికున్న అనుబంధాన్ని చాటుకున్నారు. 


Also Read: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా ఫస్ట్ స్ట్రైక్ డేట్ ఫిక్స్ - అంచనాలు పెంచేస్తున్నారుగా!