Love Mouli Trailer Is Out Now: ఒకప్పుడు హీరోలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆ తర్వాత వర్కవుట్ అవ్వక కనుమరుగు అయిపోయిన వాళ్లు ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం హీరోలుగా అవకాశాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో ఒకరే నవదీప్. ఇన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన నవదీప్.. తన అవతారాన్ని పూర్తిగా మార్చేసి ‘లవ్ మౌళి’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇది నవదీప్ 2.0 వెర్షన్. తాజాగా ‘లవ్ మౌళి’ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక పెయింటర్ ప్రేమకథ అని అర్థమవుతోంది.
అదిరిపోయే డైలాగ్స్..
‘ఒక ఒంటరి మనిషి కథ’ అంటూ ‘లవ్ మౌళి’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో అడ్వెంచర్స్ చేస్తూ.. ఒంటరిగా జీవించే వ్యక్తిగా నవదీప్ కనిపిస్తాడు. తన మనస్తత్వం ఏంటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడం కోసం ట్రైలర్‌లో కొన్ని డైలాగులు ఉన్నాయి. ‘నువ్వెందుకు పెయింటింగ్ చేస్తావు’ అని ఒక వ్యక్తి.. నవదీప్‌ను అడగగా.. ‘నేను అలాగే మాట్లాడతాను’ అని తను చెప్పడం పెయింటింగ్‌పై తనకు ఎంత ఇష్టం ఉందో తెలిసేలా చేస్తుంది. ‘పట్టపగలు కూడా వెలుగు పడని ఈ గుహలాంటి గుండె నాది’ అంటూ తను హీరోయిన్‌తో చెప్పే డైలాగ్‌తో తను ఎంత ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడో అర్థమవుతుంది. అంతే కాకుండా ‘ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు, ఎంత సంపాదిస్తున్నామో చూసి పెళ్లి చేసుకుంటారు’ అంటూ విమర్శించే డైలాగ్స్ కూడా ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.
మౌళి ప్రేమ పోరాటం..
‘లవ్ మౌళి’ ట్రైలర్ పూర్తిగా 4 నిమిషాల నిడివి ఉంది. ఇక ట్రైలర్‌లో ఫస్ట్ హాప్ దాదాపుగా మంచి విజువల్స్‌తో నిండిపోయింది. ఆ తర్వాతే ప్రేమ కోసం మౌళి వేట మొదలవుతుంది. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో పెయింటింగ్ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఒక అమ్మాయిని పెయింట్ చేస్తాడు. అనూహ్యంగా ఆ పెయింటింగ్‌లోని అమ్మాయి ప్రాణం పోసుకుంటుంది. అంతా బాగుంది అనుకునే సమయానికి ఆ అమ్మాయి తనకు నచ్చదు. దీంతో ఇంకొక అమ్మాయిని పెయింట్ చేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని తన క్రూర మనస్తత్వంతో దూరం చేసుకుంటూ ఉంటాడు మౌళి. ఇలా ‘లవ్ మౌళి’ టీజర్‌లోనే దాదాపుగా కథ మొత్తం బయటపెట్టేశారు మేకర్స్. ముఖ్యంగా నవదీప్ మనస్తత్వం ఎలా ఉంటుందో ట్రైలర్‌లోనే బయటపడింది.
న్యూడ్ సీన్స్..
'లవ్ మౌళి' చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్స్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో నవదీప్‌కు జోడీగా పంఖురి గిద్వానీ నటించింది. ఈ మూవీ నవదీప్ ఒక సీన్‌లో న్యూడ్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. అలాగే పంఖురి కూడా టాప్‌లెస్‌గా కనిపించనుందని తెలుస్తోంది. నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో భావన సాగి నటించింది. మొత్తానికి ‘లవ్ మౌళి’ ట్రైలర్ డిఫరెంట్‌గా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంది. నాని.. ఈ ట్రైలర్‌ను డిజిటల్ లాంచ్ చేశాడు.
Also Read: వచ్చే సంక్రాంతికి రవన్న కామెడీ దావత్ ఇస్తుండు - రెడీ అయిపోండ్రి, ఇక ధూమ్ ధామ్ జాతరే