Venkatesh 76th movie update: విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే, 'సైంధవ్' తర్వాత ఆయన చేయబోయే సినిమా ఎవరి దర్శకత్వంలో అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. తనకు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి భారీ విజయాలు అందించిన అనిల్ రావిపూడితో వెంకటేష్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరో తెలుసా?


భీమ్స్ సంగీతంలో వెంకటేష్ 76వ సినిమా!
వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ & ఫిలిమ్స్ చేస్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ ఈ మూవీ మ్యూజిక్ మీద ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేసినట్లు తెలిసింది.


'బలగం', 'మ్యాడ్' వంటి సూపర్ హిట్ సినిమాలకు లాస్ట్ ఇయర్ భీమ్స్ మ్యూజిక్ అందించారు. రెండు మూడు సినిమాలకు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఈ ఇయర్ 'రజాకార్' ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రజెంట్ 'టిల్లు స్క్వేర్'కు రీ రికార్డింగ్ చేస్తున్నారు. అది కాకుండా ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకీ సినిమా కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు తమ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాలని కోరుకుంటున్న హీరోలు, దర్శకుల సంఖ్య పెరుగుతోంది. వరుస విజయాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు భీమ్స్.


Also Read: ఓం భీమ్ బుష్ రివ్యూ: బ్యాంగ్ బ్రోస్ మేజిక్ ఎలా ఉందంటే - శ్రీవిష్ణు సినిమా హిట్టా? ఫట్టా?



హీరో వెంకటేష్... దర్శకుడు అనిల్ రావిపూడి... సంగీత దర్శకుడు భీమ్స్... ఈ ముగ్గురి కలయికలో ఫస్ట్ సినిమా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వహించిన మొదటి మూడు సినిమాలకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆ తర్వాత మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ పని చేశారు. 'భగవంత్ కేసరి'కి తమన్ వర్క్ చేశారు. ఇప్పుడు వెంకీ సినిమాకు సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న భీమ్స్ (Bheems Ceciroleo Upcoming Movies)ను తీసుకున్నారు. హీరోగా వెంకటేష్ 76వ చిత్రమిది. 


మే లేదా జూన్ నెలలో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి ముగిసింది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని, డాక్టర్ నిశాంత్ వివాహం జరిగిన విషయం ప్రేక్షకులు అందరికీ తెలుసు.


Also Readఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ నటించిన ఉషా మెహతా బయోపిక్ ఎలా ఉందంటే?


అమ్మాయి పెళ్లి పనులు, ఆ తర్వాత హడావిడి ముగియడంతో దగ్గుబాటి హీరోలు షూటింగులకు వెళుతున్నారు. బాబాయ్ వెంకీ, అబ్బాయ్ రానా నటిస్తున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రెండో సీజన్ సెట్స్ మీదకు వెళ్లింది. ఒకట్రెండు రోజుల్లో వెంకటేష్ చిత్రీకరణలో పాల్గొంటారు. అందుకోసం ముంబై వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా మొదలు అవుతుంది.