Adah Sharma Emotional Trolls She Called Prostitute: ఆదా శర్మ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. నితిన్‌ 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఇందులో ఆమె లుక్‌, గ్లామర్‌కు యూత్‌ ఫిదా అయ్యింది. ఇందులో నితిన్‌తో డీప్‌ కిస్‌ సీన్‌తో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కానీ ఆ తర్వాత ఆమెకు ఎందుకో అవకాశాలు రాలేదు. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, క్షణం, కల్కి వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మాత్రం పెద్దగా యూజ్‌ కాలేదు. ఫలితంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.


దీంతో బాలీవుడ్‌కు వెళ్లిన ఆదా అక్కడ లేడీ ఒరియంటెడ్‌, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నటిగా కెరీర్‌ని నెట్టుకొస్తుంది.'ది కేరళ స్టోరీ', 'బస్తర్‌: ద నక్సల్‌ స్టోరీ' వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ సెన్సేషన్‌ అవుతుంది. హిందీలో ఆమె నటించి ఈ రెండు చిత్రాలు వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తను నటించినందుకు ఆమె దారుణమైన ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుందట. ఏకంగా వేశ్య అంటూ ఆమెను తిడుతుంటున్నారంటూ తాజాగా ఆదా శర్మ వాపోయింది. ప్రస్తుతం ఆమె 'బస్తర్‌: ద నక్సల్‌ స్టోరీ' మూవీతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది.  ఈ సందర్భంగా తన బస్తర్‌ మూవీ విశేషాలను పంచుకుంది. బస్తర్‌ మూవీ పోస్టర్‌ విడుదలైనప్పటి నుంచి తనని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారని చెప్పింది. ఇందులో ఆదా చేతిలో గన్‌తో రగ్గర్డ్‌ లుక్‌లో కనిపించింది.


ఇందులో ఆదా మహిళా ఐపీఎస్‌ అధికారి పాత్ర పోషించింది. ఈ పోస్టర్‌ రిలీజ్‌ అనంతరం తనకు ఎదురైన ట్రోల్స్‌పై తాజాగా ఇంటర్య్వూలో పెదవి విప్పింది. "బస్తర్‌ మూవీ పోస్టర్‌ రిలీజ్‌ తర్వాత చాలా మంది ఎన్నెన్నో విధాలకు నన్ను విమర్శిస్తున్నారు. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే డైరెక్టర్‌ నన్ను అమ్మాయి అన్న విషయం మరిచిపోవాలి అన్నారు. సున్నితమైన అమ్మాయిని అనే విషయం మరిచిపోయి.. అడవిలో తిరిగే మనిషి ఎలా ఉంటాడు, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉండాలన్నారు. చెప్పాలంటే అడవుల్లో తుపాకి పట్టుకునే తిరిగే అబ్బాయి ఎలా ఉంటాడు, అతడికి ఎలా కండలుంటాయో అలా కనిపించాలన్నాడు. అప్పుడే ఈ పాత్ర చేసేందుకు నాకు ఈజీ అవుతుందన్నారు. నిజానికి రిలీజైన ఫస్ట్‌ పోస్టర్‌లో నేను లేను. కేవలం అడవులను చూపిస్తూ దానిపై 'బస్తర్‌' అన్న టైటిల్‌ మాత్రమే ఉంది.


Also Read: 'పుష్ప 2' మరో సాలిడ్‌ అప్‌డేట్‌ - పార్ట్‌ 2లో సమంత అతిథి పాత్ర, ఈసారి ఐటెం సాంగ్‌ కాదట!


అయినా సరే ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమా తీస్తున్నారంటూ రకరకాలుగా విమర్శించారు. అప్పటి నుంచి నేను ఏ పోస్ట్‌ చేసిన కొందరు తిట్టిపోస్తున్నారు. మరికొందరు అయితే ఏకంగా వేశ్య అంటూ అసభ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు. అప్పుడు సినిమా రిలీజ్‌ కాకముందే ఇంత ట్రోలింగా అనిపించింది. వాటికి ఎలా రిలాక్ట్‌ అవ్వాలో నాకు అర్థం కాలేదు. కానీ, వారందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక సినిమా చూడకముందే విమర్శలు చేయాలనుకుంటే అదీ మీ ఇష్టం. మికు అనిపించింది చెప్పే హక్కు మీకు ఉన్నట్టే.. నటిగా నాకు నచ్చిన సినిమాలు చేసే హక్కు నాకూ ఉంటుంది" అంటూ ట్రోలర్స్‌కి ఆదా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.