Chirutha Heroine Neha Sharma Political Entry: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇండియా మొత్తం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నగరా మోగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అభ్యర్ధుల జాబితా కూడా వచ్చేసింది. ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే పలు సినీ సెలబ్రిటీలు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి రాధిక శరత్ కుమార్ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడుతుంది. ఇప్పుడు తాజాగా మరో యంగ్ బ్యూటీ కూడా రాజాకీయాల్లోకి రాబోతుంది.
ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'చిరుత' బ్యూటీ నేహ శర్మ. చిరుత సినిమాతో లైమ్‌లైట్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పులు చిత్రాల్లో అలరించింది. ప్రస్తుతం ఈ సినిమాలకు దూరంగా ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెరుస్తుంది. తరచూ తన సోదరితో కలిసి జీమ్, ఈవెంట్స్‌కు వెళుతూ మీడియాకు ఫోజులు ఇస్తుంది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో ఈ బ్యూటీ వినిపించడంతో అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ వెల్లడించడం విశేషం. ప్రస్తుతం బిహార్ లోని భాగల్ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నేహాశర్మ తండ్రి. అయితే మహాఘట్ బంధన్ సీట్ల పంపకంపై చర్చల నేపథ్యంలో తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కూతురికి టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు. దాంతో అప్పటి నుంచి రాజకీయాల్లోకి బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ అంటూ వార్తుల వస్తున్నాయి. అయితే కూతురు అన్నారు గానీ, ఆమె ఎవరన్నది మాత్రం స్పష్టం చేయలేదు.
నేహా శర్మకు లోక్ సభ టికెట్?
ఎందుకంటే నేహా శర్మకు ఒక అక్క ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెనా, నేహా శర్మ అనేది స్పష్టత లేదు. తాజాగా భాగల్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో అజిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నారు. "భాగల్‌పూర్ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటింది. లోక్‌సభ ఎన్నికల కూటమిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే సీటు రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకే సీటు వస్తే మాత్రం ఈసారి ఎంపీగా నా కూతురిని నిలబెట్టాలనుకుంటున్నా. లేదంటే నేనే పోటీ చేస్తా" అని అన్నారు.
Also Read: 'పుష్ప 2' మరో సాలిడ్ అప్‌డేట్ - పార్ట్ 2లో సమంత అతిథి పాత్ర, ఈసారి ఐటెం సాంగ్ కాదట!
అనంతరం ఈ విషయమైన హైకమాండ్‌తో చర్చించానని, ఇక్కడ కనుగ కాంగ్రెస్‌కే సీటు వస్తే మాత్రం నేను లేదా నా కూతురు ఇద్దరిలో ఎవరమైన పోటీ చేస్తామన్నారు. దీంతో అజీత్ శర్మ కామెంట్స్ ఇటూ ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు వెడేక్కాయి. ఈ హీట్ బి-టౌన్‌కి కూడా పాకింది. దీంతో నేహా శర్మ పోలిటికల్ ఎంట్రీ ఇటూ ఇండస్ట్రీలోనూ అటూ రాజకీయాల్లోనూ హాట్‌టాపిక్ మారాయి. హార్ లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్టీయే మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాగా. ఇండియా కూటమి చర్చలు జరుపుతుంది. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వెల్లడించారు.