Pithapuram: పిఠాపురంలో సక్సెస్ మీట్ - Manamey Pre Release Eventలో పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన శర్వానంద్

Manamey Pre Release Event: 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ చెప్పిన విషయం తెలుగు సినిమా ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు కిక్ ఇస్తుందని చెప్పవచ్చు.

Continues below advertisement

Manamey Pre Release Event Highlights: ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు సంగతి... పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం (Pithapuram Assembly Constituency) జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్, సర్వేల్లో వెల్లడైన తరుణమది. ఫలితాలు వెల్లడి కాక ముందే పిఠాపురంలో మూవీ ఈవెంట్ చేయడానికి ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) రెడీ అయ్యారు. అయితే... ఏపీలో పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ రంగ అధికారులు, పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. అలాగని, శర్వా నిరుత్సాహపడలేదు. 'మనమే' నెక్స్ట్ ఈవెంట్ అక్కడ చేయాలని ప్లాన్ చేశారు. 

Continues below advertisement

పిఠాపురంలో 'మనమే' మూవీ సక్సెస్ మీట్! 
Manamey movie success meet in Pithapuram: 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ''యాక్చువల్లీ... ఈ ఫంక్షన్ ముందుగా ఇదే రోజు పిఠాపురంలో చేద్దామని అనుకున్నాం. కానీ, అనుమతులు రాలేదు. మొన్నెప్పుడో అడిగాం. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారు ప్లాన్ చేస్తే... పిఠాపురంలో సక్సెస్ పార్టీ చేయాలని ఉంది. మన సినిమా పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సో, సక్సెస్ కొట్టిన పిఠాపురంలో కలుద్దాం'' అని శర్వానంద్ చెప్పారు.

చంద్రబాబు, పవన్, బాలయ్యకు శర్వా అభినందనలు
ఏపీలో ఘనవిజయం సాధించిన కూటమి నేతలకు, తెలుగు దేశం అండ్ జనసేన పార్టీ అధినేతలకు 'మనమే' ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ కంగ్రాట్స్ చెప్పారు. ''ముందుగా 'మనమే వస్తాం' అని చెప్పి మరీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. చాలా సంతోషంగా ఉంది. మా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు... ఆయన (పవన్)ది పదేళ్ల కష్టం. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడినది మన కోసం. ఆ ఫలితం చూశాం'' అని శర్వా చెప్పారు.

Also Read'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

'పిఠాపురం'లో జరగబోయే 'మనమే' మూవీ సక్సెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారా? లేదంటే అబ్బాయ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తారా? అనేది చూడాలి. జనసేనానితో 'బ్రో' నిర్మించారు టీజీ విశ్వ ప్రసాద్. వాళ్ల మధ్య మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్, శర్వా క్లోజ్ ఫ్రెండ్స్ అనేది తెలిసిన విషయమే.

Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన 'మనమే' చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. శర్వానంద్ సరసన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఈ సినిమాలో శ్రీరామ్ ఆదిత్య కుమారుడు, చిన్నారి విక్రమ్ ఆదిత్య ఓ మెయిన్ రోల్ చేశాడు. శుక్రవారం థియేటర్లలోకి వస్తుందీ సినిమా. ఈ సినిమాలో మొత్తం 16 పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహెబ్ తెలిపారు. అందులో కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి.

Continues below advertisement