Jabardasth audience angry over Roja: సీనియర్ కథానాయిక, నటి రోజా సెల్వమణి (Roja Selvamani) గురించి యువతరం ప్రేక్షకులకు, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం తెలుసంటే కారణం 'జబర్దస్త్'. నటిగా అవకాశాలు లేని ఆమెకు 'జబర్దస్త్' జడ్జి సీటు తెలుగు ప్రజల్లో గుర్తింపు తెచ్చింది. మైలేజీ ఇచ్చింది. 


నగరిలో ఎమ్మెల్యేగా, వైసీపీ నాయకురాలిగా కంటే 'జబర్దస్త్' జడ్జిగా ఆవిడకు ఎక్కువ పేరు ఉంది. అందుకే, ఏపీ ఎన్నికల్లో నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఘోర పరాజయం పొందిన తర్వాత 'జబర్దస్త్ పిలుస్తోంది కదలిరా' అని బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్ వేశారు. రోజా మళ్లీ 'జబర్దస్త్'కు జడ్జి వెళితే మంచిదని కొందరు సలహాలు కూడా ఇచ్చారు. 


రోజా సెల్వమణి 'జబర్దస్త్'కు వస్తారో? రారో? ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే తాము ఆ షో చూసే ప్రసక్తి లేదని, 'జబర్దస్త్'ను బాయ్ కాట్ చేస్తారని కొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కింద కామెంట్స్ చూస్తే... రోజా రాకూడదని కోరుకుంటున్న ఆడియన్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు.



రోజా ఓవర్ యాక్షన్ చూడలేమని ఒకరు, రోజా వస్తే షో క్లోజ్ అవుతుందని మరొకరు, రోజా వస్తే 'జబర్దస్త్ బాయ్ కాట్ ట్రెండ్' అవుతుందని ఇంకొకరు ఎలా కామెంట్ చేశారో చూశారుగా! 'జబర్దస్త్'కు రోజా రావాలని కొందరు కామెంట్ చేశారు. అయితే, వాటి కంటే ఇలా వద్దని చేసిన కామెంట్లు ఎక్కువ. అదీ సంగతి!


Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా



రోజా మీద ఎందుకు అంత వ్యతిరేకత!?
రోజా రాజకీయ ప్రయాణం ప్రారంభమైనది తెలుగు దేశం పార్టీలో! ఆమెకు తొలుత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీ. అప్పట్లో విజయం సాధించలేదు. ఆ తర్వాత పార్టీ మారారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే, పార్టీ మారిన తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ మీద నోరు పారేసుకున్న వైసీపీ నేతల్లో రోజా ఒకరు. జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఆవిడ చెప్పిన వీడియోలు ఏపీలో కూటమి విజయం తర్వాత వైరల్ అయ్యాయి. అందుకని, ఆవిడ 'జబర్దస్త్'కు రాకూడదని కొందరు కోరుకుంటున్నట్టు వున్నారు.


Also Read'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?



ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ముందు నుంచి సర్వేలు చెప్పాయి. కానీ, వైసీపీ నమ్మలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకతకు, ప్రజలంతా వచ్చి ఓట్లు వేయడానికి రోజా సెల్వమణి, కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వంటి నేతలు కారణమని బండ్ల గణేష్ ట్వీట్ చేశారంటే... ఆవిడ ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఐదేళ్ల పాటు ఆవిడ నగరిలో తిరుగుతారా? మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కార్యకర్తలతో మమేకం అవుతారా? లేదంటే నటిగా బిజీ అవుతారా? అనేది చూడాలి.