Naga Panchami Today Episode: పంచమి పిల్లల చేతికి ఉన్న తాయెత్తులు తీయడానికి జ్వాల లోపలికి వెళ్తుంది. ఇక పంచమి కూడా అప్పుడే అక్కడికి వస్తుంటుంది. అది చూసిన చిత్ర జ్వాలని పిలుస్తుంది. జ్వాల పిల్లల ఇద్దరి చేతికున్న రుద్రాక్షలు తీసేస్తుంది. పంచమి వచ్చిన టైంకి జ్వాల చిత్రని తీసుకెళ్లిపోతుంది. ఇక పంచమి పిల్లలకు దుప్పటి కట్టి చేతికున్న రక్షలు లేవని చూసి షాక్ అయిపోతుంది. పంచమి ఏడుస్తుంది. తన పిల్లలను ఎలా కాపాడుకోవాలని బాధపడుతుంది. రక్షలు ఎలా మాయం అయ్యావని అనుకుంటుంది. 


కరాళి నీలుకి చూపు తెప్పించడానికి పూజ చేస్తుంటుంది. నీలు రాత్రంతా పడుకోకుండా ఉంటుంది. నీలు తల్లిదండ్రులు మాత్రం కునుకు తీస్తూ ఉంటారు. కరాళి తన అన్న నంబూద్రీ ఇచ్చిన సంజీవని వేరుని నీలు వైపు  పెడుతుంది. ఆ వేరుకు వచ్చిన శక్తి నీలు కళ్లలోకి ప్రవేశించి నీలు కింద పడిపోతుంది. నీలు పెద్ద కేక పెట్టి లేవదు. దాంతో నీలు తల్లిదండ్రులు వచ్చి నీలుకి ఏమైందా అని కంగారు పడతారు. ఇక కరాళి మళ్లీ మంత్ర శక్తి ప్రయోగించడంతో నీలు కదులుతుంది. లేచి చూస్తే నీలుకి చూపు వస్తుంది. నీలు తల్లిదండ్రులు కరాళికి కృతజ్ఞతలు చెప్తారు. నీలు కరాళికి హగ్ చేసుకుంటుంది. కరాళి చేసిన పనిని అందరికీ చెప్తే నిన్ను దేవతగా భావించి పూజలు చేస్తారు అని అంటే కరాళి ఏం వద్దు అని తన పని అయిపోయిందని ఇక తను వెళ్లిపోతాను అని మళ్లీ ఇటు వైపు వస్తే మిమల్ని కలుస్తాను అని అంటుంది. తనని సంతోషంగా సాగనంపమని చెప్తుంది. 


మరోవైపు నాగేశ్వరి పాము పంచమి ఇంటి దగ్గరకు వస్తుంది. విశాలాక్షి అంశతో పుట్టిన బిడ్డ ఎవరో తెలుసుకోవాలి అని నాగేశ్వరి అనుకుంటుంది. పంచమికి తెలీకుండా ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలను కలుసుకోవడానికి నాగ వశీకరణ మంత్రం చెప్పి వశీకరణ చేసుకోవాలి అని పాపకు నాగశక్తులు ఉంటే పాప తన దగ్గరకు వస్తుందని అనుకుంటుంది. తర్వాత ఆ పాపని మచ్చిక చేసుకొని నాగలోకం తీసుకెళ్లి పోవాలి అనుకుంటుంది. ఓ చోట నాగ వశీకరణ మంత్రం జపిస్తుంది. మరోవైపు పంచమి టెన్షన్‌గా ఉంటుంది. అది చూసి వైదేహి ఏమైందని అడుగుతుంది. ఇక ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. పిల్లల రుద్రాక్షులు పోయావని పంచమి కంగారు పడి ఇంట్లో వాళ్లకి చెప్తుంది. జ్వాల చిత్రలను చూసి ఎవరో కావాలనే తీసేసుంటారు అని చెప్తుంది. ఎవరైనా తీసుంటే చెప్పమని అందరినీ వేడుకుంటుంది.


జ్వాల, చిత్రలు వితండంగా వాదిస్తారు. వేరేవి కొని తెస్తాను అని వైదేహి అడిగితే నాకు అవే కావాలి అని పంచమి అంటుంది. ఇక చిత్ర పంచమితో నీ పిల్లల్లో ఏదో తేడా ఉంది అని ఏదో దాస్తున్నావ్ అని అంటాడు. దానికి పంచమి మా పిల్లలకు ఏ లోపాలు లేవు  అని మా పిల్లలకు దిష్టి తగల కుండా ఆ రక్షలు కట్టాను అని అంటుంది. తన మనసుకి కీడు శంకిస్తుందని అందుకే అవి కావాలి అనుకుంటున్నాను అని అంటుంది. చిత్ర, జ్వాలలు నీ పిల్లలు పాము పిల్లలు అని అంటే పంచమి కోప్పడుతుంది. తన పిల్లల జోలికి వస్తే నాలుక కత్తిరిస్తాను అని బెదిరిస్తుంది. పంచమి అంతగా తిరగబడి మాట్లాడింది అంటే ఏదో తేడా ఉందని జ్వాల చిత్రతో అంటుంది. మరోవైపు మోక్ష అడవిలో వెళ్తూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని నిలదీసిన కృష్ణ.. కుమిలిపోతున్న మురారి!