Trolls On Anchor Shyamala: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల ప్రచారంలో చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. అందులో చాలామంది జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయగా.. చాలా తక్కువమంది వైఎస్ జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడారు. వాళ్లలో యాంకర్ శ్యామలా ఒకరు. ప్రచారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న సమయంలో శ్యామలా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘పిఠాపురంలో వంగా గీత గెలుపు ఆల్రెడీ ఖాయమయిపోయింది. నేను ఆమెను వచ్చి కలవడం, ప్రచారంలో పాల్గొనడం కేవలం భారీ మెజారిటీ కోసం మాత్రమే’’ అని శ్యామలా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


తోడేలు, నక్క కథ..


వైసీపీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్ గురించి గొప్పగా మాట్లాడుతూ యాంకర్ శ్యామలా.. ప్రచారాల్లో ఇతర పార్టీలపై, వ్యక్తులపై తీవ్రంగా విమర్శలు చేసింది. అందులో భాగంగానే ఒక ముసలి తోడేలు, నక్క కథ కూడా చెప్పింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ముసలి తోడేలు, నక్కలతో పోల్చింది. ప్రజలను కుందేళ్లని.. తోడేలు, నక్కలను నమ్మొద్దని సలహా ఇచ్చింది. అప్పట్లో శ్యామలా చెప్పిన కథ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలయినప్పటి నుండే శ్యామలాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత తను సపోర్ట్ చేసిన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో మరోసారి తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.


పోస్టులు డిలీట్..


ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది శ్యామలా. వైసీపీకి, జగన్‌కు సపోర్ట్‌గా ఎన్నో వీడియోలు పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని వీడియోలు కనిపించడం లేదు. చాలావరకు డిలీట్ చేసింది. అంతే కాకుండా ఉన్న వీడియోలకు, ఫోటోలకు కూడా కామెంట్స్ ఆప్షన్‌ను తీసేసింది. దీంతో శ్యామలా ఏమైపోయింది, ఎందుకు సైలెంట్ అయ్యింది అంటూ ఇతర పార్టీ సపోర్టర్స్ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తుందని అంత నమ్మకంగా చెప్పిందని, మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వైసీపీకి అంతలా సపోర్ట్ చేసినందుకు శ్యామలా కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


పవన్‌పై వ్యాఖ్యలు..


వైసీపీ కేవలం జనాల కోసమే పనిచేస్తుందని, అనుక్షణం జనాల గురించే ఆలోచిస్తుందని చాలా గొప్పగా చెప్పుకొచ్చింది శ్యామలా. అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై నేరుగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు పవన్ కళ్యాణ్ సాయం చేయడమే తను ఇప్పటివరకు చూడలేదని చెప్పింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా తనపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యల వల్ల వైసీపీపై మరింత నెగిటివిటీ పెరగడం ఖాయమని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మొత్తానికి టీడీపీ, జనసేన ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా శ్యామలాపై వ్యతిరేకత మొదలయ్యింది. దీంతో తను కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.






Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా