Actress Shobana and Vijay Deverakonda Also in Kalki 2898 AD: పాన్‌ ప్రభాస్‌ మోస్ట్ అవైయిటెడ్‌ చిత్రం 'కల్కి 2898 AD'. జూన్‌ 27న ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిలింగా కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుననాడు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే విశ్వనటుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ నటిస్తున్నారు.


అయితే తాజా బజ్‌ ప్రకారం ఈ సినిమాలో మరికొందరు స్టార్‌ నటీనటులు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారు. వారిలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్‌ నటి చేరారు. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె చాలా గ్యాప్‌ తర్వాత కల్కితో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది ఆమె ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జుల సరసన అలరించిన ఆమె తెలుగు తెరకు దూరమైన దాదాపు పద్దెనిమిది ఏళ్లు అవుతుంది. ఆవిడే నటి శోభన. కల్కిలో శోభన ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస.


విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌లతో పాటు శోభన కూడా కల్కిలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారట. అయితే ఈ పాత్రలకు సంబంధించి వివరాలను మూవీ టీం రహస్యంగా ఉంచుతుందట. ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు అతిథి పాత్రలను పరిచయం చేయడంలేదట. మరి ఈ సినిమాలో శోభన ఉంటుందా? లేదా అనేది మూవీ రిలీజ్‌ వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం శోభన 18 ఏళ్ల తర్వాత శోభన నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. చివరిగా ఆమె 2006లో వచ్చిన  ‘గేమ్‌’ సినిమా నటించారు. ఈ చిత్రం తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయినా శోభన ప్రస్తుతం కళాకారిణిగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.   


Also Read: పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పవన్‌ కళ్యాణ్‌ - ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!


మరోవైపు 'కల్కి' ట్రైలర్‌ రిలీజ్‌ డైట్‌, డేట్‌ ఫిక్స చేసిన మూవీ టీం తాజాగా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ జూన్‌ 7న రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే కల్కి ప్రమోషన్స్‌ నాగ్‌ అశ్విన్‌ ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే కల్కిలో ప్రముఖమైన పాత్రలు భైరవ, బుజ్జిల ప్రమోషన్‌ సరికొత్త ప్లాన్‌ చేశారు. వీరిద్దరి పరిచయం చేస్తూ బుజ్జీ మరియు భైరవ పేరుతో యానిమేషన్‌ సరీస్‌ను ఓటీటీలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు ఓటీటీలో మంచి రెస్సాన్స్‌ వస్తుంది.