Pawan Kalyan Net Worth Assets and Debts Details: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై అరవై తొమ్మిది వేల(69 వేలు) ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ ఫాలోవర్స్, ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకుంటుంది. ఇక ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పవన్ గెలుపుని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.
అయితే మొదటి నుంచి పవన్ రాజకీయం ఎంట్రీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్‌లో వీలినం చేశారు. అన్నయ్య లాగే పవన్ కూడా తన జనసేనాను టీడీపీలో విలీనం చేశారంటూ ట్రోల్స్‌పై చేశారు. అలాగే ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కూడా ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పించాయి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పవన్ వెనకడుగు వేయలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒడిపోయారు.. ఇక ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు.
కానీ ఒటమికి కుంగిపోకుండా ఈ సారి మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోయారు. "హాలో ఏపీ.. బైబై వైసీపీ" అనే నినాదంతో ప్రచారంలో జోరు చూపించారు. పడి లేచిన కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం సాధించారు. పవన్‌కి రాజకీయాలు తెలియవంటూ ట్రోల్ చేసిన వారికి ఈ విజయం చెంపపెట్టు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆస్తులు వివరాలు చూద్దాం!
పవన్ ఆస్తులు, అప్పులు
సినీ నటుడిగా దాదాపు 30 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ బాగానే సంపాదించారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తులు విలువ రూ.164 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ సంపాదన 114 కోట్ల 76 లక్షలు ఉండగా.. ఆదాయ పన్నుగా రూ.47 కోట్ల 7 లక్షల జీఎస్టీ రూపంలో రూ.28 కోట్ల 84 లక్షలు చెల్లింపులు ఉన్నాయట. అలాగే ఆయన అప్పులు రూ. 65 కోట్ల వరకు ఉన్నట్టు ఎమ్మెల్యేగా నామినేషన్‌లో టైం ఆయన దాఖలు చేసి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ నుంచి రూ.18 కట్లు, వ్యక్తుల నుండి రూ.48 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్టు సమాచారం. ఇక 2014లో జన సేన పార్టీని స్థాపించిన ఆయన పదేళ్లుగా తన సొంత ఖర్చులతోనే పార్టీ నడిపిస్తు వచ్చారు.
కొణిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ బాపట్లలో కొణదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్ ఫ్రావిణ్యుడైన ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందారు. అలాగే మార్షల్ ఆర్ట్స్‌లో అవార్డులు కూడా అందుకున్నారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, నాగేంద్రబాబు బాటలో నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హీరోగా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'గోకులంలో సీత', 'తొలి ప్రేమ',1999లో పవన్ నటించిన తొలి ప్రేమ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా అదే సంవత్సరం జాతీయ అవార్డుత పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత వెంటనే 'తమ్ముడు,'బద్రి',ఖుషీ','జానీ' ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు.
మూడు పెళ్లిళ్లు..
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే నందిని అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 1997లో వీరి పెళ్లి జరగింది. ఇక బద్రి మూవీ టైంలో రేణు దేశాయ్‌తో ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ ఆమె కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఫస్ట్ భార్య నందినికి 2007లో విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2012 విడాకులు తీసుకున్నారు. వీరికి అకిరాన నందన్, ఆద్యలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పవన్ కళ్యాన్ నటించి తీన్‌మార్ మూవీ టైంలో ఆ సినిమా అతిథి పాత్రలో కనిపించిన అన్నా లెజ్నెవాతో ప్రేమలో పడ్డ పవన్ కళ్యాణ్ ఆమెతో సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. ఇక వీరిద్దరికి ఓ కూతురు పుట్టాక రెండవ భార్య రేణు్ దేశాయ్‌తో విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం 2013లో అన్నా లెజ్నెవాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.