Sharwanand's Manamey movie censor report: ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు అందించే యువ కథానాయకుడు శర్వానంద్. 'ఒకే ఒక జీవితం' విజయం తర్వాత ఆయన నటించిన సినిమా 'మనమే'. శుక్రవారం (జూన్ 7న) థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ కూడా తక్కువే. 2.35 గంటలే. అంతే... సినిమాకు మంచి రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ సభ్యులతో పాటు సినిమా చూసిన కొందరు ఇండస్ట్రీ జనాలు చెప్పే మాట ఇది ష్యూర్ షాట్ హిట్. 


స్టైలిష్ శర్వా... అందమైన సాంగ్స్...
కొత్త వరల్డ్ చూపించిన శ్రీరామ్ ఆదిత్య!
వెండితెరపై 'మనమే' మొదలైన కాసేపటికి శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళతాడని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. దీనికి ముందు ఆయన తీసిన సినిమాలు గమనిస్తే... ఒకవైపు ప్రేక్షకులకు వినోదం అందిస్తూ, మరోవైపు భావోద్వేగాలు చూపించడం శ్రీరామ్ ఆదిత్య స్టైల్. ఇంతకు ముందు సినిమాల కంటే ఈసారి మరింత బలమైన భావోద్వేగాలతో సినిమా తీశారట.


హేషమ్ అబ్దుల్ వాహేబ్ పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. శ్రోతలను ఆకట్టుకున్నాయి. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, గ్రాండ్ ప్రొడక్షన్ వేల్యూస్, ఫారిన్ లొకేషన్స్ వల్ల స్క్రీన్ మీద పాటలు మరింత అందంగా ఉన్నాయని తెలిసింది. సినిమాకు మెయిన్ హైలైట్ ఎమోషన్స్ & కామెడీతో పాటు శర్వానంద్ యాక్టింగ్, ఆయన స్టైల్ అని చెప్పారు. 'ఒకే ఒక జీవితం'తో కంపేర్ చేస్తే క్యారెక్టర్ కుదరడంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని, ప్రేక్షకులు అందర్నీ ఆయన క్యారెక్టర్ ఆకట్టుకోవడం ఖాయమని తెలిసింది.


Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా


ఇటీవల కాలంలో విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా 'మనమే' లాంటి స్టైలిష్ ఫిల్మ్ రాలేదని... కథలో బలమైన ఎమోషన్స్, కామెడీతో కూడిన కంటెంట్ కూడా ఉండటంతో ష్యూర్ షాట్ హిట్ అంటున్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో పాటు ఒక్క బోరింగ్ మూమెంట్ లేకుండా సినిమా సాగిందట.  ముఖ్యంగా వెన్నెల కిశోర్ కామెడీ కడుపుబ్బా నవ్వించడం గ్యారంటీ అంటున్నారు. 


లాస్ట్ 40 మినిట్స్ సినిమాకు హైలైట్!
'మనమే'కు లాస్ట్ 40 మినిట్స్ హైలైట్ అవుతుందని, బలమైన భావోద్వేగాలకు తోడు హీరో హీరోయిన్ల నటన ఆ సమయంలో సీట్ల నుంచి ప్రేక్షకులు బయటకు కూడా వెళ్లలేని విధంగా చేస్తాయని చెప్పారు. కృతి శెట్టి నటన చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారట. 'మనమే'తో బాలనటుడిగా పరిచయం అవుతున్న శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ క్యూట్ లుక్స్, యాక్టింగ్ ఆడియన్స్ అందరికీ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్. వేసవికి మంచి విజయంతో 'మనమే' వినోదాత్మక ముగింపు ఇస్తుందని ఇండస్ట్రీ రిపోర్ట్.


Also Readపవన్ కోట్లలో ఒక్కడు... అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు, ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది


'మనమే' సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించారు. శివ కందుకూరి, అయేషా ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రామ్‌ సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ సంస్థలో టీజీ విశ్వ ప్రసాద్‌  ఉన్నత నిర్మాణ విలువలతో సినిమా తీశారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.