Renu Desai About Akira Nandan: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి రేణూ దేశాయ్.. తరచుగా తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఒక్కోసారి ఆమె పోస్టులు తీవ్ర ట్రోలింగ్ కు గురైన సందర్భాలున్నాయి. తాజాగా రేణూ తన కొడుకు కంపోజ్ చేసిన ఓ మ్యూజిక్ క్లిప్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. అకీరాకు సంబంధించిన మాంటేజ్ మేకింగ్ స్కిల్స్ ఇకపై తరచుగా అభిమానులతో పంచుకోనున్నట్లు వెల్లడించింది. “అకీరాకు స్పెషల్ మాంటేజ్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయి. మ్యూజిక్ పట్ల తనకున్న ఆసక్తి గురించి ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఇప్పుడు ఆ విషయాన్ని ఈ క్లిప్ ద్వారా మీతో పంచుకుంటున్నాను. ఈ రోజు నుంచి అకీరా మ్యూజిక్ స్కిల్స్ గురించి మీ అందరితో పంచుకుంటాను” అని చెప్పుకొచ్చింది.






సినిమాలు అంటే అకీరాకు పెద్దగా ఇష్టం లేదు-రేణూ దేశాయ్


నిజానికి పవన్ కల్యాణ్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి హీరోగా అడుగు పెడితే బాగుంటుందని చాలా మంది భావించారు. అయితే, ఈ విషయం గురించి రేణూ దేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అకీరా నందన్ ప్రస్తుతం తనకు నచ్చినట్లుగా ఉంటున్నాడని చెప్పింది. అతడికి మ్యూజిక్ ఇష్టం కాబట్టి, మ్యూజిక్  క్లాసులకు వెళ్తున్నాట్లు వెల్లడించింది. పియానో వాయించడం కూడా తనకు చాలా ఇష్టమని చెప్పింది. “అకీరా గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. చాలా ఇంటర్వ్యూల్లోనే వివరించాను. తనకు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. అతడి ప్రపంచమే వేరు. అతడు హీరోగా చేస్తానంటే నేను చాలా సంతోషిస్తాను. నా కొడుకు హీరో అవుతున్నాడని గొప్పగా చెప్పుకోవచ్చు. నేను తనను చాలాసార్లు అడిగాను. హీరోగా చేయడం ఇంట్రెస్ట్ ఉందేమో చెప్పమన్నాను. హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నారని చెప్పాను. కానీ, వాడు నో చెప్పాడు. తనకు సినిమాల కంటే మ్యూజిక్ మీదే ఎక్కువగా ఆసక్తి ఉంది” అని వివరించింది.


బలవంతం చేసి నటుడిగా మార్చలేను- రేణూ దేశాయ్


అకీరా మ్యూజిక్ తర్వాత యోగా, బాక్సింగ్, ప్రాణాయామం లాంటివి ఎక్కువగా చేస్తాడని రేణూ వెల్లడించింది. అంతేకాదు, అకీరాను ఏనాటికైనా పెద్ద స్టేడియంలో వందల మంది ముందు పియానో వాయిస్తుంటే చూడాలని ఉందని చెప్పింది. తల్లిగా అప్పుడు తాను చాలా గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది. నిజానికి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, అకీరాను స్ర్కీన్ మీద చూడాలని ఉంది. ఎందుకంటే, నేను నటినే, తన తండ్రి నటుడే, తను కూడా నటుడు కావాలని కోరుకుంటున్నాను. అయితే, బలవంతం చేసి తనని నటుడిగా మారమని చెప్పను. అతడికి నచ్చితేనే చేయాలని చెప్తాను” అని రేణూ దేశాయ్ వెల్లడించింది.  


Read Also: యాంకర్ శ్యామలాను ఐరన్ లెగ్ అంటోన్న నెటిజన్స్ - ఆమె ప్రచారం చేసిన అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులు ఓటమి