Anchor Shyamala: ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ చాలా మంది సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొన్నారు. కొందరు కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తే, మరికొంత మంది వైసీపీకి సపోర్టుగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సెలబ్రిటీల్లో కొందరు చేసే కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి. తీవ్ర విమర్శలకు, ట్రోలింగ్ కు గురయ్యాయి.  ప్రస్తుతం యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీకి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించడంతో పాటు టీడీపీ, పవన్ కల్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైకు పట్టుకుని ఆవేశ పడటం తప్ప.. పవన్ కల్యాణ్ ఎవరికీ సాయం చేయలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పిఠాపురంలో వంగ గీత గెలుపును ఆపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేసింది.


నెల రోజుల పాటు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా యాంకర్ శ్యామల ప్రచారం


ఏపీలో వైసీపీ గెలుపు కోసం యాంకర్ శ్యామల తీవ్రంగా శ్రమించింది. ఏకంగా నెల రోజుల పాటు ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసింది. ఏప్రిల్ 11న నెల్లూరులో మొదలైన ఆమె ప్రచారం నెల రోజుల పాటు కొనసాగి మే 11న మళ్లీ నెల్లూరులోనే ముగిసింది. ఆమె ప్రచారం చేసిన అన్ని చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘోర పరాభవాన్ని చవి చూడటం విశేషం.  


శ్యామల ప్రచారం చేసిన ప్రచోటా వైసీపీ అభ్యర్థులు ఓటమి


నిజానికి యాంకర్ శ్యామల ప్రచారం వల్ల వైసీపీ అభ్యర్థులకు జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. మే 11న నెల్లూరులో ఆ పార్టీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని కలిసి యాంకర్ శ్యామల ప్రచారాన్ని ప్రారంభించింది. అక్కడి నుంచి వైజాగ్ ఈస్ట్, వెస్ట్ లో అవంతి శ్రీనివాస్, బోత్సా ఝాన్సీ గెలుపును కాంక్షిస్తూ క్యాంపెయిన్ చేసింది. పిఠాపురంలో వంగా గీత, కాకినాడలో చలమలశెట్టి సునీల్, కురసాల కన్నబాబు, రాజమండ్రిలో మార్గాని భరత్, అమరావతిలో మేకతోటి సుచరిత, మంగళగిరిలో మురుగుడు లావణ్యకు మద్దతుగా ప్రచారం చేసింది. విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాశ్, విజయవాడ వెస్ట్ లో కేశినేని శ్వేత, గుడివాడలో కొడాలి నాని, మైలవరంలో తిరుపతి రావు, పెద్దకుర్రపాడులో నంబూరి శంకర్ రావు, సత్తెన పల్లిలో అంబటి రాంబాబు, మచిలీపట్నంలో పేర్ని నాని, పేర్నికిట్టు,  పొన్నూరులో అంబటి మురళీ, గుంటూరు కిలారి రోశయ్య, చిత్తూరు విజయానంద్, నెల్లూరు విజయసాయిరెడ్డి తరఫున ప్రచారం చేసింది. ఆమె ప్రచారం చేసిన అన్ని చోట్లా ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.






యాంకర్ శ్యామలపై తీవ్రంగా ట్రోలింగ్


ఎన్నికల ప్రచారం వేళ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన యాంకర్ శ్యామల.. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కూటమి మద్దతుదారులు, నెటిజన్లు ఆమెను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. శ్యామల గత వీడియోలను షేర్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ట్రోల్స్‌పై శ్యామలా ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.


Also Read: ఇప్పుడు ఏపీలో 'కల్కి'ని ఆపేది ఎవ్వడ్రా... తెలుగు దేశం విజయంతో నిర్మాత అశ్వనీదత్ ఫుల్ హ్యాపీ