Kalki 2898 AD producer C Ashwini Dutt is the most happiest person with Telugu Desam Party win: నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఆ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బంది పడింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ విషయంలో సమస్యలు ఎదుర్కొంది. ఇక మీదట ఆ ఇబ్బందులు, సమస్యలు ఉండవని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత థియేటర్లలో విడుదల కానున్న భారీ పాన్ ఇండియా సినిమా 'కల్కి 2898 ఏడీ'. టీడీపీ రాకతో ఆ సినిమా నిర్మాతకు ఫుల్ ప్రాఫిట్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు.


ఇప్పుడు ఏపీలో 'కల్కి'ని ఆపేది ఎవడ్రా!?
సినిమా బడ్జెట్ ఎంతైనా కావచ్చు. టికెట్ రేటు మాత్రం డిసైడ్ చేసేది ఏపీలో జగన్ ప్రభుత్వమే. ఆ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు పడిగాపులు కాశారు స్టార్ హీరోలు, నిర్మాతలు. ఆ విజువల్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చూశారు.


తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల్లో కొందరు ముందు నుంచి తెలుగు దేశం పార్టీకి వీర విధేయులు. వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అటువంటి నిర్మాతల్లో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు ఐదు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' విడుదల ముందు మరో ఆలోచన లేకుండా నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగు దేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. 


ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే? ఆ ఆలోచన 'కల్కి' మూవీ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ హక్కులు కొన్న, కొనుగోలు చేయాలని అనుకుంటున్న కొంత మందిలో భయాన్ని కలిగించింది. వైసీపీ అధికారంలోకి వస్తే? భారీ రేట్లకు సినిమాను కొంటే? లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి రాదని భయపడ్డారు. ఇప్పుడు ఆ భయాలు అవసరం లేదు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో తెలుగు సినిమాకు పూర్వ వైభవం వస్తుందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఏపీలో 'కల్కి 2898 ఏడీ' బెనిఫిట్ షోలు పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అంతే కాదు... టికెట్ రేట్లు సైతం పెంచుకోవడానికి అనుమతులు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు.


Also Read: అల్లు అర్జున్ రాంగ్ స్టెప్ వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? 'పుష్ప 2'ను పవన్ ఫ్యాన్స్ చూస్తారా? మెగా మద్ధతు ఉంటుందా?


ఒక్క 'కల్కి' సినిమాకు మాత్రమే కాదు... ఏపీలో ఇతరత్రా సినిమాలకు సైతం కొత్త ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ముందు నుంచి సినిమా ఇండస్ట్రీకి తెలుగు దేశం పార్టీ సన్నిహితంగా మెలిగింది. ఆ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు హీరో కావడం, ఆయన వారసులు అటు పార్టీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మాత్రమే కాదు... చిత్రసీమ కష్టసుఖాలు తెలిసిన కొందరు తెలుగు దేశంలో ఉండటం కూడా ఆది నుంచి సత్సంబంధాలు కొనసాగేలా ఉండటానికి కారణం అయ్యింది.


Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా & జనసేన ఫ్యాన్స్!