Allu Arjun gets backlash after Pawan Kalyan winning tweet: జనసేనాని పవన్ కళ్యాణ్ విజయంతో అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమలో పవన్ వీరాభిమానిగా ముద్ర పడిన హీరో నితిన్ సైతం ట్వీట్ చేశారు. ఇక పవన్ వీరభక్తుడు హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సెట్స్‌లో టపాసులు కాల్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పవన్ (Pawan Kalyan)కు అభినందనలు తెలియజేస్తుంటే... మెగా అభిమానులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మాత్రం ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.


జనసేనానికి బన్నీ శుభాభినందనలు
''అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాభినందనలు. ప్రజలకు సేవ చేయాలని కొన్నేళ్లుగా మీరు చేస్తున్న కృషి, మీ పట్టుదల,  హృదయానికి హత్తుకునేవి. మీ కొత్త ప్రయాణానికి బెస్ట్ విషెష్'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ విజయంతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల విజయం పట్ల ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారని అనుకోవాలి.


Also Read: పవన్ కళ్యాణ్ ఓటమికి తల వంచలేదు... ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు






నంద్యాలలో చేసిన పొరపాటు మళ్లీ చెయ్యవని...
ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్, జనసేన శ్రేణులు ఇంకా మర్చిపోలేదు. ఆ విజిట్ గుర్తు చేసేలా 'నంద్యాలలో చేసిన పొరపాటు మళ్లీ చెయ్యవని ఆశిస్తున్నా' అని నెటిజన్ ట్వీట్ చేశాడు. ''నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ (నంద్యాల)కు కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఉంటే బావుండేది'' అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు.


Also Read: అల్లు అర్జున్ రాంగ్ స్టెప్ వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? 'పుష్ప 2'ను పవన్ ఫ్యాన్స్ చూస్తారా?










నంద్యాలలో నీ ఫ్రెండ్ ఓడిపోయాడు... వాడు ఎక్కడ?
''నంద్యాల ఫ్రెండ్ ఏమయ్యాడు అన్నా! నువ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తావ్, పార్టీకి సపోర్టివ్ గా ఉంటావ్ అనుకున్నాం గానీ ఫ్రెండ్ అని చెప్పి అపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశావ్. పోనీ వాడేమన్నా పెద్ద పోటుగాడా అంటే కాదు. సినిమా పరిశ్రమకు కష్టం వస్తే వాడిని కలిసి సమస్య పరిష్కరించలా'' అని ఇంకో పవన్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. 






''నీ నిర్ణయానికి మేం గౌరవం ఇస్తాం. కానీ, ఆ ఒక్క విజిట్ చాలా మందిని హార్ట్స్ చేసింది. సలహా కాదు గానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో... ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్ రెండిటిలో ఒక్కటి ఎంపిక చేసుకోవాల్సి వస్తే రిలేషన్షిప్ కోసం ఎప్పుడూ ఫ్యామిలీయే'' అని బన్నీ మీద సెటైర్ వేశాడొకడు.


Also Readపవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌ చల్