జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయం తథ్యమని ఎన్నికల సరళిని గమనించినా... ఎగ్జిట్ పోల్స్ చూసినా అర్థం అవుతోంది. ఏపీలో పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency Results 2024) నుంచి ఎమ్మెల్యేగా పవన్ గెలుపు ఖాయమని ముందు నుంచి రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) శ్రేణులు, మెగా అభిమానులు సోషల్ మీడియాలో విజయోత్సవాలు మొదలు పెట్టారు.


పవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత?
సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా ట్విట్టర్ చూస్తే... జనసేన ప్రయాణం, జనసేనాని ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలను క్లుప్తంగా వీడియోల రూపంలో ఎడిట్ చేశారు. అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' హ్యాష్ ట్యాగ్, నంబర్ ప్లేట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా 'పిఠాపురం ఎమ్మెల్యే గారి అభిమాని' అంటూ కొత్త ట్రెండ్ మొదలైంది.


Also Read: ఏపీలో మొదలైన ఉత్కంఠ - మూడు చోట్ల టీడీపీ లీడ్, పిఠాపురంలో ఊహించని పరిణామం










ఎమ్మెల్యేగా పవన్ విజయం సాధించిన తర్వాత వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా షేర్స్ చెయ్యడం కోసం అంటూ బోలెడు ఆప్షన్స్ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ ఎవరైనా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కోసం వీడియోస్ కావాలని అనుకుంటే... ఈ కింద ఇచ్చిన వీడియోలు చూడండి. డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ కింద షేర్స్ చేసుకోండి.


Also Read: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఎన్నికల కౌంటింగ్ - లీడింగ్ లో ఎవరున్నారంటే?