AP Assembly Election Results 2024 Live Updates: జనసేన పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకి ఘన సత్కారం!
Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates: APలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. APలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక స్వాగతం పలికారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ , శ్రీమతి అనా, తనయుడు అకీరా నందర్ చంద్రబాబుని ఘనంగా సత్కరించారు.
జనసేన అధినేత, బాబాయ్ పవన్ కళ్యాణ్ విజయంపై రామ్ చరణ్ రియాక్టయ్యాడు. ఈ విజయం తమ కుటుంబానికే గర్వకారణం ..మీది అద్భుతవిజయం పవన్ కళ్యాణ్ గారు అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చెర్రీ...
కూటమి ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం , ససమ్యలు పరిష్కరించుకుని అభివృద్ధి పథం వైపు సాగుదామని కోరారు......
ఏపీలో చంద్రబాబు ఘనవిజయంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్రు చరిత్రాత్మకం , మీ నాయకత్వం , దార్శినికత స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేశారు...
కుప్పంలో చంద్రబాబు గెలుపు - 47340 ఆధిక్యం
పులివెందుల జగన్మోహనరెడ్డి గెలుపు - 61,687 ఆధిక్యం
మంగళగిరిలో లోకేష్ గెలుపు - 90160 ఆధిక్యం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు - 70,279 ఆధిక్యం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్...ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ కు రాజీనామా లేఖ పంపించారు. గడిచిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ...ఈ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా చతికిలపడి సింగిల్ డిజిట్ కి పరిమితమైంది...
ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుని సద్వినియోగం చేసుకుంటాం...ఆడబిడ్డలకు అండగా ఉంటాం... ఉద్యోగులకు సీపీఎఫ్ విషయంలో న్యాయం చేస్తాం అని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు పవన్...
పిఠాపురంలో ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రజలమధ్యలో మాట్లాడారు. జగన్, వైసీపీ నాకు శత్రువులు కాదు, ఇది కక్ష సాధింపు సమయం కాదన్నారు. చీకటి రోజులు ముగిసిపోయాయి...భవిష్యత్ తరాలకోసం బాధ్యతగా ముందుకు సాగాలన్నారు...
పిఠాపురంలో ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రజలమధ్యలో మాట్లాడారు. జగన్, వైసీపీ నాకు శత్రువులు కాదు, ఇది కక్ష సాధింపు సమయం కాదన్నారు. చీకటి రోజులు ముగిసిపోయాయి...భవిష్యత్ తరాలకోసం బాధ్యతగా ముందుకు సాగాలన్నారు...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు...
విజయోత్సాహంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 9 న ముఖ్యమంత్రిగా ప్రయాణం చేయనున్న సందర్భంగా ఢిల్లీ పెద్దలను ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వాహించనున్నారు. మరోవైపు కేంద్రంలో NDA సర్కార్ ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది...
జగన్ నోట ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ అనే మాట వినిపించింది. గతంలో ఎప్పుడు పవన్ పేరు ప్రస్తావించినా...ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అంటూ విమర్శలు గుప్పించేవారు జగన్. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం - వైసీపీ ఘోర పరాజయం తర్వాత మాట్లాడిన జగన్... పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ ప్రస్తావించారు.
ప్రతిపక్షంలో ఉండడం నాకు కొత్తకాదు..కష్టాలు పడడం కొత్తకాదు..ఇప్పుడు కొత్త కష్టాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా అడుగు ముందుకువేస్తాం...మళ్లీ నిలదొక్కుకుంటాం అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ముగించారు జగన్....
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ మీడియా ముందు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అందరకీ మంచి చేశాం...మ్యానిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అమలు చేశాం..అయినా ఎందుకిలా జరిగిందో అర్థంకావడం లేదన్నారు. ఏ జరిగిందో దేవుడికే తెలుసు...ప్రజా తీర్పు తీసుకుంటాం...మళ్లీ ధైర్యంగా అడుగేస్తాం అన్నారు జగన్...
ఏపీ ప్రజల అభివృద్ధి కోసం ఎంతో తాపత్రయ పడ్డాను అన్న వైసీపీ అధినేత జగన్....ఆ అక్కా చెల్లెళ్లు, అవ్వ తాతల ఆప్యాయత అంతా ఏమైపోయిందో , పిల్లల చదువుల కోసం తాపత్రయపడ్డాం, నేతన్నలు, మత్స్యకారులకు అందరకీ మంచి చేశాం అంటూ భావోద్వేగానికి గురయ్యారు జగన్...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా సింగిల్ డిజిట్ కి పరిమితమైంది...ఈ మేరకు మీడియా ముందుకి వచ్చిన జగన్...ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయన్నారు...
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ తో పాటూ సతీమణి అనా కొణిదెల, తనయుడు అకీరానందన్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన మొత్తం స్థానాల్లో విజయం సాధించింది.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో బురదచల్లే రామ్ గోపాల్ వర్మ...ఫస్ట్ టైమ్ కాస్త పాజిటివ్ గా రియాక్టవాల్సి వచ్చింది. కూటమి గెలుపుపై స్పందించిన RGV.. 'CONGRAAAAAATTTSSSSS' అంటూ పోస్ట్ పెట్టాడు..
పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆయన మాజీ భార్య , నటి రేణు దేశాయ్ స్పందించారు. జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు సింబాలిక్‌గా ఆద్య వీడియో షేర్ చేశారు. ఇందులో ఆద్య గ్లాస్‌లో కూల్ డ్రింగ్ తాగుతూ కనిపించింది. దీనికి "ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుంచి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ మాజీ భర్త పవన్ విజయంపై పోస్ట్ పెట్టింది రేణూ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీపీఐ నారాయణ.. ఈ ఫలితాలు జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వ పోకడకు నిదర్శనం అన్నారు. ఈ దేశంలో అత్యధికంగా సంక్షేమ పథకాలు మా ప్రభుత్వమే అందిస్తోందని విర్రవీగిన వైసీపీకి...గతంలో టీడీపీకి వచ్చిన సీట్ల సంఖ్య కన్నా తక్కువ వచ్చాయన్నారు...
కూటమి ఘన విజయంపై చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. ప్రత్యేక హోదా సాధించే అవకాశం వచ్చింది.. ఇండియా కూటమి అవన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంది...మరి మీ దారెటు? ఇండియా కూటమితో వస్తారా - NDA తో వెళతారా అంటూ రఘువీరా ట్వీట్ చేశారు..
ఘన విజయం సాధించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణకు సినీ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల హీరో చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ అల్లరి నరేష్, మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని రవితేజ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే చిరంజీవి, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్ మొదలు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు కూటమి విజయంపై స్పందించారు...
కూటమి విజయోత్సాహంలో ఉన్న చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఆ ట్వీట్ లో ఏముందంటే.. " ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను"
పవన్ కళ్యాణ్ విజయంపై స్పందించారు అన్నయ్య చిరంజీవి. "డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అని ట్వీట్ చేశారు....
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగితేలారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తో పాటూ బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పవన్ విజయంపై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు.ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, హరీష్ శంకర్ , నితిన్, నాగవంశీ, బ్రహ్మాజీ, మారుతీ, కాజల్ అగర్వాల్ సహా పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. రవితేజ బచ్చన్ మూవీ షూటింగ్ సెట్ లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఎపీ అసెంబ్లీ ఎన్నికల్ల వైసీపీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ నుంచి రాజంపేట అభ్యర్థిగా పోటీచేసిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి... ప్రత్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై విజయం సాధించారు...
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు దాదాపు ఖారురు అయిపోయింది. ఈనెల 9న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలు...వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగింది NTR పేరు పెట్టారు...
ఏలూరు జిల్లా లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గాలు దాడులకు దిగాయి. ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో షాపు వద్ద కూల్ డ్రింక్ తాగుతున్న టీడీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి... కూల్ డ్రింక్ సీసాలతో టీడీపీ నేతలపై దాడులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు...పోలీసులుజోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు
కూటమి నుంచి పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి ఎమ్ ఎస్ రాజు...ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు...
AP Assembly Election Results 2024: పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. 59 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. గతంలో 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీ రాగా ఈసారి 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ తరఫున రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలైనా భారీగా ఓట్లు కొల్లగొట్టారు.
AP Assembly Election Results 2024: సీఎం జగన్ సొంత జిల్లాలోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాల్లో కేవలం పులివెందుల, బద్వేల్, రాయచోటి, రాజంపేటల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అటు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, మైదుకూరు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వేకోడూరులో జనసేన కూటమి నేతలు ముందంజలో ఉన్నారు.
AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో విజయం కైవసం చేసుకోగా.. 86 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఏపీలో ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు కొనసాగుతోంది. కూటమి గెలుపు పక్కా అని క్లారిటీ వచ్చేయడంతో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఓటమి జీర్ణించుకోలేక వైసీపీ దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు...
విశాఖ 2, చిత్తూరు 2, కడప 4, కర్నూలు 1...ఈ స్థానాల్లో మాత్రమే వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. వైనాట్ 175 అన్నారు...కనీసం రెండు డిజిట్లకు అయినా పరిమితం అవుతుందేమో అనుకుంటే మధ్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది. సింగిల్ డిజిట్ కే చేరింది వైసీపీ లెక్క
AP Assembly Election Results 2024: మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయనపై విజయం సాధించారు.
కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీచేసిన జనసేన ప్రభంజనం సృష్టించింది. మొదట్నుంచీ లీడింగ్ లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటూ ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఈ లెక్కన జనసేన పోటీకి దిగిన 21 స్థానాల్లోనూ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి....
నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం....ఈ జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక అనంతపురం, కర్నూలులో ఓ స్థానం అటు ఇటుగా ఉంది.
AP Assembly Election Results 2024: సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ విజయం సాధించారు. అటు, పార్వతీపురం టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై 23,650 ఓట్లతో గెలుపొందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన సుజనా చౌదరి...కూటమి గెలుపు ముందుగా ఊహించినదే అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తాను ముందుగా చెప్పిన విషయమే నిజమైందన్నారు. జగన్ పార్టీ ఓటమితో ఆంధ్రప్రదేశ్ కి మంచి రొజులొచ్చాయని అభిప్రాయపడ్డారు సుజనా...
AP Assembly Election Results 2024: రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై 22,196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
హిందూపురం నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా మూడోసారి విజయం సాధించారు. బాలకృష్ణ నివాసానికి భారీగా చేరుకున్నారు అభిమానులు. ఫ్యాన్స్ కి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు బాలయ్య...
కూటమి గెలుపుని సచివాలయం ఉద్యోగులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సచివాలయం మెయిన్ గేట్ వరకూ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు...బాణసంచా కాల్చి సంబరాల్లో మునిగితేలారు. కేవలం సచివాలయంలోనే కాదు..ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు....
పిఠాపురం నుంచి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి బయలుదేరారు. ఈ మేరకు కాకినాడ ఎస్పీ ఆఫీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలిపేడ్ పర్మిషన్ తీసుకున్నారు. జనసేన నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.... పిఠాపురంలో పోటీచేసిన పవన్ కళ్యాణ్...ప్రత్యర్థి వంగా గీతపై 70 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు...
ఉండి నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. 56,777 ఓట్ల మెజార్టీతో వైసీపీ నేత పి.వి.ఎల్. నర్సింహరాజుపై కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయం సాధించారు.
పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేనాని విజయం సాధించారు. తన మేనమామ గెలుపుపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. పవన్ ఓ చిన్నారి ఎత్తుకున్న పిక్ షేర్ చేసిన తేజ్..."ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం , భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది. జనసేన పార్టీ పవర్ తుఫాను" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పిక్, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... నితిన్, హరీష్ శంకర్ కూడా పవన్ విజయంపై ఎక్స్ లో పోస్ట్ చేశారు
AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ.. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై ఘన విజయం సాధించారు.
AP Assembly Election Results 2024: ఏపీలో ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం స్థానంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి కంప్లీట్ మెజార్టీ దిశగా దూసుకెళ్తోన్న ఆన 14 రౌండ్ తర్వాత 61,152 వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీలో పవన్ కొనసాగుతున్నారు.
AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది..కూటమి విజయం పక్కా అని క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు కాల్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
AP Assembly Election Results 2024: మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 36 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై ఆయన గెలుపొందారు. ఇక్కడ దశాబ్దాలుగా గెలవని ఈ స్థానాన్ని కైవసం చేసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు లోకేశ్. ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ రెండుసార్లే విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. ప్రజలతో మమేకమైన లోకేశ్.. సేవా కార్యక్రమాలు కొనసాగించి ప్రజలకు మరింత చేరువయ్యారు.
AP Assembly Election Results 2024: ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజుపై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై.. టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ గెలుపొందారు.
కూటమితో కలసి బరిలోకి దిగిన జనసేన తొలివిజయం అందుకుంది. 21 స్థానాల్లోనూ లీడింగ్ లో ఉన్న జనసేన..భీమవరం నియోజకవర్గం నుంచి మొదటి గెలుపు నమోదు చేసుకుంది. 64,037 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై పులపర్తి రామాంజనేయులు విజయం సాధించారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన రోజా ఓటమి అంచున ఉంది. పరిస్థితి అర్థమై ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇలాంటి టైమ్ లో రోజాని ఉద్దేశించి బండ్ల గణేష్ 'జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా' అని పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న పవన్...11 రౌండ్లు ముగిసేసరికి పవన్ మెజారిటీ 50,671 వద్ద కొనసాగుతోంది. ఈ మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది...
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు విజయానికి చేరువలో ఉన్నారు. కూటమి జోరు చూసి టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు... ఈమేరకు బంజారాహిల్స్ సాక్షి ఆఫీస్ ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల జోరు మరింత పెరిగింది. రౌండ్స్ పెరిగేకొద్దీ కూటమి అభ్యర్థుల ఆధిక్యం భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకూ ఫైనల్ అయిన 5 విజయాలు కూటమి అభ్యర్థులవే. రాజమండ్రి రూరల్,రాజమండ్రి అర్బన్, కొవ్వూరు, అనపర్తి, పాలకొల్లు...ఈ నియోజకవర్గాల నుంచి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన కూటమి అభ్యర్థులంతా బీభత్సమైన లీడింగ్ లో ఉన్నారు. కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కొట్టుకుపోతోంది...ప్రస్తుతం వైసీపీ లీడింగ్ లో ఉన్న స్థానాలు పరిశీలిస్తే కనీసం 15 సీట్లు కూడా సాధించేలా కనిపించడం లేదు...మరోవైపు చంద్రబాబు జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది..
ఏపీలో బీజేపీని తొలివిజయం పలకరించింది. కూటమిఅభ్యర్థిగా బీజేపీ నుంచి అనపర్తి నియోజకవర్గం నుంచి బరిలో దిగిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి...20,567 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డిపై విజయం సాధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 9 న అమరావతిలో ప్రమాణం చేయనున్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే... జూన్ 9 ఆదివారం తదియ...శ్రీరామచంద్రుడి నక్షత్రం అయిన పునర్వసు. రాముడి జన్మనక్షత్రంలో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు... టైమ్ 11 గంటల 53 నిముషాలు...
గెలుపు దిశగా కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఓటమిపాలవుతున్న వైసీపీ నేతలు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లిపోతున్నారు... లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... జూన్ 9న చంద్రబాబు ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఏపీలో జనసేన సునామీ సృష్టిస్తోంది. గడచిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన పార్టీ...ఇప్పుడు పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో దూసుకెళుతోంది. కూటమి కేటాయింపుల్లో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన జనసేన...ఇప్పటికే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాకినాడలో మొదట్నుంచీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్... తెనాలిలో నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్దాప్రసాద్ , రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, కాకినాడ రూరల్, మచిలీపట్నం, పి.గన్నవరం, ఉంగుటూరు అనకాపల్లి, పెందుర్తి, విశాఖ దక్షిణ, యలమంచిలి, నెల్లిమర్ల, తిరుపతి, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై 55వేల మెజార్టీతో విజయం సాధించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రాజీనామా చేసే అవకాశం ఉంది. కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి రాజానీమా పత్రం సమర్పించే అవకాశం
కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిల్లాడుతోంది. దాదాపు 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది కూటమి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుని..భారీ భద్రత కల్పించే దిశగా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు....
AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి.. సమీప వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 57 వేల ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్న వైసీపీ అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉంది. నగరిలో వెనుకంజలో ఉన్న రోజా ఈ సందర్భంగా ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. చిరునవ్వుతో ఉన్న పిక్ షేర్ చేసిన రోజా... 'భయాన్ని విశ్వాసంగా..ఎదురుదెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా... తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు' అని రోజా ట్వీట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యంలో దూసుకెళుతున్న సందర్భంగా అమెరికాలో NRIలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూటమి జోరు ఓ రేంజ్ లో ఉంది....
AP Assembly Election Results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, మంగళగిరి నుంచి నారా లోకేశ్, హిందూపూర్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం దిశగా కొనసాగుతున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు హవా సాగుతోంది. మొదటి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 11700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు లోకేష్. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఐదవ రౌండ్ పూర్తి అయ్యేసరికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 8039 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. చోడవరం నియోజకవర్గం కేఎస్‌ఎన్ రాజు రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 3893 ఓట్లు, చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య రెండో రౌండ్ ముగిసేసరికి 4120 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఏకంగా 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అల్లు అర్జున్ ప్రచారం చేసిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఫరూక్ 10 వేల లీడింగ్ లో ఉన్నారు
ఏపీలో కూటమి విజయం సాధించే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. 150 స్థానాలకు పైగా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఉత్సాహంలో టీడీపీ కార్యకర్తలంతా సంబరాలు చేసుకుంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు మామూలుగా లేదు. ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉన్న జనసేనాని 20 వేలకి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు మూసేసరికి పవన్ కళ్యాణ్ కు సుమారు 20 వేల ఆధిక్యం వచ్చింది..మొత్తం 18రౌండ్లకు గాను 4రౌండ్లు పూర్తయ్యాయి... ఇంకా 14 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది..
ఏపీలో కూటమి అభ్యర్థుల జోరులో వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే వెనుకంలో ఉన్న కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు..
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏపీలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది..ఇప్పటికే లెక్క మ్యాజిక్ ఫిగర్ దాటేసింది...ఉత్సాహంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు...
ఏపీ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. ఏపీలో బొత్స మినహా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. ఉదయం 10 గంటల సమయానికి కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు...
కుప్పంలో చంద్రబాబునాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, నెల్లిమర్లలో లోకం నాగమాధవి, విశాఖ ఈస్ట్ లో వెలగపూడి, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండలో ఆంజనేయులు, రాజానగరంలో బత్తుల బలరాంకృష్ణ, పీలేరులో నల్లారి కిషోర్, ఆముదాలవలసలో రవికుమార్, బొబ్బిలిలో బేబినాయన, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి, నెల్లూరులో వేమిరెడ్డి, నరసరావుపేటలో కృష్ణదేవరాయులు, నంద్యాలలో బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ సహా దాదాపు 110 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళుతున్నారు....
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూటమి అభ్యర్థులు దూసుకెళుతున్నారు. 100 స్థానాలకు పైగా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కీలక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులంతా వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్ సహా కూటమి అభ్యర్థులు చాలా స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మంత్రులు రోజా, అంబటి, పెద్దిరెడ్డి వెనుకంజలో ఉన్నారు.... ఇప్పటికే ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కూటమి
కూటమి వేవ్ లో మంత్రులను వెనక్కు నెట్టి టీడీపీ, జనసేన అభ్యర్థులు దూసుకుపోతున్నారు.... నగరిలో రోజా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్, బుగ్గన, ధర్మాన సహా పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు....
పోస్టల్ బ్యాలెట్ లో కూటమి జోరు కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్‌కుమార్, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్, గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని, నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి సహా పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది....
అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు...ఇక్కడ వైసీపీ తరఫున అనంత వెంకటరామి రెడ్డి బరిలో ఉన్నారు....
నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు...ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు
బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబినాయన ఆధిక్యం
పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ఆధిక్యం
దర్శిలో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ ముందంజ
శృంగవరపుకోట టీడీపీ అభ్యర్థి లిలితకుమారి ఆధిక్యం
చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆధిక్యం
గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజ
జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆధిక్యం
పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఆధిక్యం
పులివెందులలో CM జగన్ ఆధిక్యం...తొలి రౌండ్ లో 1888 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు...
తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల ఆధిక్యం
నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా వెనుకంజ
ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో , పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ , మంగళగిరిలో లోకేష్ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ లో వెనుకబడ్డ విజయసాయిరెడ్డి
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజ
పిఠాపురంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే ఆసక్తి రేకిత్తిస్తోన్న ఈ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా చెల్లని ఓట్లు వచ్చాయి.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే టీడీపీ 2 చోట్ల లీడింగ్ లో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ స్థానంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి 900కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ముందంజలో ఉన్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 1549 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించారు. ఉదయం 8:30కు ఈవీఎంలను లెక్కింపు ప్రారంభిస్తారు.
Background
Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మంగళవారం (జూన్ 4) కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దాదాపు 4 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. వీటి లెక్కింపునకు ప్రత్యేక కౌంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తొలి ఫలితం అక్కడే
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, మాచర్ల, తిరుపతి నియోజకవర్గాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఉంటుందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మొత్తం 119 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన ఫోన్ల వరకూ తీసుకెళ్లవచ్చని సూచించారు. కాగా, తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెలువడనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరి ఫలితం రానుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసుకోవచ్చు. మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెల్లడయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
సర్వత్రా ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 26,473 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, ఎన్నికల ఫలితంపై అధికార వైసీపీ, టీడీపీ - బీజేపీ - జనసేన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కొన్ని సంస్థలు అధికార వైసీపీదే అధికారమని.. సీఎం జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని.. చంద్రబాబు సీఎం కాబోతున్నారని తేల్చాయి. ఈ క్రమంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అధికార వైసీపీ సహా, టీడీపీ కూటమి నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు. అటు, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మెజార్టీపైనా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -