Lok Sabha Election Results 2024 LIVE: వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం - దేశంలోనే అత్యధిక మెజార్టీ ఎక్కడంటే?

Lok Sabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఏపీ, ఒడిశా అసెంబ్లీతో పాటు 543 లోక్ సభ స్థానాలకు లెక్కింపు జరగనుంది.

Ganesh Guptha Last Updated: 04 Jun 2024 08:25 PM
రాయ్ బరేలీ ప్రజల రుణం తీర్చుకోలేనిది - ప్రియాంక గాంధీ

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందడంపై ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. 'మీ ప్రేమ, అభిమానంతో మరోసారి ఆశీర్వదించారు. మీ రుణం తీర్చుకోలేనిది.' అని ట్వీట్ చేశారు.





ఇండోర్ బీజేపీ అభ్యర్థి రికార్డ్ విక్టరీ

Loksabha Election Results 2024: ఇండోర్ బీజేపీ అభ్యర్థి లల్వాని చరిత్ర సృష్టించారు. బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌పై 12,26,751 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థికి 51,659 ఓట్లు పోల్ అయ్యాయి.

ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం - ప్రధాని మోదీ

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. 'ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. దేశ చరిత్రలోనే ఇదో చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. ఈ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా.' అని పేర్కొన్నారు.





251 స్థానాల్లో ఎన్డీయే గెలుపు - 174 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 252 స్థానాల్లో విజయం సాధించగా.. 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, I.N.D.I.A కూటమి 174 స్థానాల్లో విజయం సాధించగా.. 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 46 స్థానాల్లో విజయం సాధించగా.. 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

బుధవారం I.N.D.I.A కూటమి కీలక భేటీ - రాహుల్ గాంధీ

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. I.N.D.I.A కూటమి తదుపరి కార్యాచరణపై బుధవారం కీలక భేటీలో చర్చించనున్నట్లు చెప్పారు. వయనాడ్, రాయ్ బరేలీ రెండు చోట్ల రాహుల్ విజయం సాధించగా.. ఏ స్థానాన్ని వదులుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.

ఒడిశాలో బేజేపీకి జై కొట్టిన జనం

Loksabha Election Results 2024: ఒడిశా ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీలో నిలవగా..  79 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది. సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయంగా తెలుస్తోంది.

ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు విజయం

Loksabha Election Results 2024: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్ జీత్ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పంజాబ్‌లోని ఫరీద్ కోట్‌లో తన సమీప ఆప్ అభ్యర్థిపై గెలుపొందారు. ఇక్కడ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఘన విజయం

Loksabha Election Results 2024: మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బహరంపూర్ స్థానం నుంచి విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయం

Loksabha Election Results 2024: హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయం సాధించారు.

జైలు నుంచి వేర్పాటువాది అమృత్ పాల్ విజయం

Loksabha Election Results 2024: పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్‌లో 'వారిస్ పంజాబ్ దే' అతివాద సంస్థ అధిపతి అమృత్ పాల్ సింగ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

లోక్ సభ ఎన్నికల్లో 10 లక్షల మెజార్టీతో విజయం

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేత శంకర్ లల్వానీ సరికొత్త రికార్డు సృష్టించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్థానం నుంచి ఏకంగా 10,08,077 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీ నేత ప్రీతమ్ ముండే మెజార్డీ రికార్డును శంకర్ లల్వానీ బద్దలుకొట్టారు. ఈ స్థానంలో 2.18 లక్షల మంది నోటాను ఎంచుకున్నారు.

అమేఠాలో స్మృతి ఇరానీకి షాక్

Loksabha Election Results 2024: యూపీలోని అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ.. స్మృతి ఇరానీపై 1.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ - మెజార్టీ ఎంతంటే?

Loksabha Election Results 2024: ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి ప్రధాని మోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఆ రెండు స్థానాల్లో రాహుల్ ఘన విజయం - భారీ మెజార్టీ

Loksabha Election Results 2024: వయనాడ్, రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అటు, యూపీలో కంచుకోట రాయబరేలీలోనూ 3.7 లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

దేశంలోనే అమిత్ షాకు భారీ మెజార్టీ - రెండో మెజార్టీ తెలంగాణలోనే!

Loksabha Election Results 2024: దేశంలోనే కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు గాంధీనగర్‌లో 7.25 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అటు, దేశంలోనే నల్గొండ ఎంపీ స్థానంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్‌కు 5.75 లక్షల ఓట్ల లీడ్ వచ్చింది.

తిరువనంతరపురంలో నాలుగోసారి శశిథరూర్ విజయం

Loksabha Election Results 2024: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. కేరళలోని తిరువనంతపురంలో సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఘన విజయం

Loksabha Election Results 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో ఘన విజయం సాధించారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరుసగా రెండోసారి విజయాన్ని అందుకున్నారు. అటు, యూపీలోని రాయ్ బరేలీలో 3.7 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

మాయావతికి షాక్

Loksabha Election Results 2024: యూపీలోని మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ వెనుకంజలో ఉంది. 80 స్థానాల్లో పోటీ చేయగా.. ఏ ఒక్క చోట మెజారిటీ లేదు. కాగా, గత ఎన్నికల్లో బీఎస్పీ 10 స్థానాలు గెలుచుకుంది.

6 లక్షల ఓట్ల ఆధిక్యంలో అమిత్ షా

Loksabha Election Results 2024: కేంద్ర హోంమంత్రి అమిత్ షా 6 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి బరిలో నిలిచిన ఆయన.. 6,50,399 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు, గుజరాత్ లో బీజేపీ 25 సీట్లలో హవా కొనసాగిస్తోంది.

6 లక్షల ఓట్ల ఆధిక్యంలో మాజీ సీఎం

Loksabha Election Results 2024: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 6 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన విదిష నుంచి బరిలో నిలిచారు.

రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

Loksabha Election Results 2024: మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

మండిలో కంగనా రనౌత్ జయకేతనం

Loksabha Election Results 2024: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించారు. హిమాచల్ ప్రదేశ్ లో మండి స్థానంలో బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఆమె.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 71 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఓటమి దిశగా ప్రజ్జ్వల్ రేవణ్ణ

Loksabha Election Results 2024: జేడీఎస్ నుంచి సస్పెండ్ కు గురైన సిట్టింగ్ ఎంపీ ప్రజ్జ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా కదులుతున్నారు. కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో ఉన్నారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే జోష్ - I.N.D.I.A కూటమి లీడ్ ఎంతంటే?

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా ఎన్డీయే 292 (బీజేపీ - 238) స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు, I.N.D.I.A  కూటమి 233 (కాంగ్రెస్ - 99, ఎస్పీ - 35) స్థానాలు, ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

లక్నోలో రాజ్ నాథ్ సింగ్ విజయం

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. లక్నోలో రాజ్ నాథ్ సింగ్ విజయం సాధించారు. అటు, కాంగ్రెస్ సైతం టఫ్ ఫైట్ ఇస్తోంది.

అమిత్ షా, ప్రధాని మోదీకి చంద్రబాబు ఫోన్

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ దాటి 300 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షాకు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అటు, ఏపీలో సైతం కూటమి ప్రభంజనం సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో కూటమి హవా

Loksabha Election Results 2024: తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమి హవా కొనసాగుతోంది. 38 స్థానాల్లో డీఎంకే - కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి లీడ్ లో ఉంది.

ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ - 290 స్థానాల్లో ఎన్డీయే, 232 స్థానాల్లో I.N.D.I.A కూటమి

Loksabha Election Results 2024: ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. 290 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా.. I.N.D.I.A  కూటమి 232 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల ఫలితాల్లో రికార్డు - 7 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

Loksabha Election Results 2024: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ రికార్డు నెలకొల్పే దిశగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకూ 7,89,625 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. కాగా, లోక్ సభ చరిత్రలో ఇప్పటివరకూ బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో 6.9 లక్షల అత్యధిక మెజార్టీ ఉంది. తాజాగా, దీన్ని శంకర్ లల్వానీ అధిగమించారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు - ఎన్డీయే, కూటమి మధ్య హోరాహోరీ, పుంజుకున్న కాంగ్రెస్

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పుంజుకుంది. కేరళ, తమిళనాడులో ఎన్డీయే ప్రభావం చూపలేదు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ హవా కొనసాగుతోంది. యూపీలో I.N.D.I.A కూటమికి గ్రాఫ్ పెరగ్గా.. మహారాష్ట్రలోనూ లీడ్ లో కొనసాగుతోంది. పంజాబ్ లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మధ్యప్రదేశ్ లో అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్, అసోంలో 10 స్థానాలు, కర్ణాటక, ఒడిశాలో బీజేపీ హవా కొనసాగుతోంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు ఆధిక్యం

 Loksabha Elections 2024: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్ జీత్ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థిపై 51 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎన్డీయే Vs కాంగ్రెస్ - ఆ 3 రాష్ట్రాలే కీలకం

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీలో 3 రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో క్లీన్ స్వీప్ దిశగా.. బీహార్ లో ఎన్డీయేకు 30కి పైగా స్థానాలు, గుజరాత్ లో 24 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - 6 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Loksabha Elections Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల వరకూ సెన్సెక్స్ 6,211 పాయింట్లు పతనమై 70,211 వద్ద.. నిఫ్టీ 1,969 పాయింట్లు దిగజారి 21,294 వద్ద కొనసాగుతోంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు - భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకూ సెన్సెక్స్ 5,193 పాయింట్లు పతనమై 71,275 వద్ద కొనసాగుతోంది. అటు, నిఫ్టీ 1665 పాయింట్లు దిగజారి 21,598 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీ జోష్ - 290 స్థానాల్లో లీడింగ్

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. 290కు పైగా స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. అటు, హస్తం సైతం టఫ్ ఫైట్ ఇస్తోంది. 195 సీట్లలో I.N.D.I.A కూటమి మెజార్టీలో ఉండగా.. 56 మంది ఇతరులు ముందంజలో ఉన్నారు.

ఒడిశాలో సీఎం వెనుకంజ

Loksabha Election Results 2024: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతా దళ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ 1158 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. పోటీ చేసిన రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎన్డీయేకి తొలి విజయం - 3.7 లక్షల మెజార్టీతో అమిత్ షా గెలుపు

Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. గుజరాత్ లోని గాంధీనగర్ లో కేంద్ర మంత్రి అమిత్ షా తొలి విజయం అందుకున్నారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయ్ పై 3.7 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు - 3,500 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్

Loksabha Election Results 2024: ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 3,500 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, నిఫ్టీ 1100 పాయింట్లు నష్టపోయింది. సూచీల ఘోర పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఒక్కరోజే ఏకంగా రూ.21 లక్షల కోట్ల సంపద కోల్పోగా.. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.404.42 లక్షల కోట్లకు తగ్గింది. 

3 లక్షలు దాటిన అమిత్ షా ఆధిక్యం

Loksabha Election Results 2024: గుజరాత్ లోని గాంధీనగర్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా హవా కొనసాగుతోంది. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయ్ పై 3 లక్షలకు పైగా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు - రాష్ట్రాల వారీగా ఏ పార్టీ లీడ్ అంటే?

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానంలో లీడ్ లో ఉంది. ఏపీలో టీడీపీ 15, వైసీపీ 3, బీజేపీ 3.. ఢిల్లీ - బీజేపీ 6, కాంగ్రెస్ 1.. బీహార్ - జేడీయూ 12, బీజేపీ 9, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, కాంగ్రెస్ 2.. ఛత్తీస్ గఢ్ - బీజేపీ 9, కాంగ్రెస్ 2.. గుజరాత్ - బీజేపీ 25, కాంగ్రెస్ 1.. హర్యానా - కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఆప్ 1.. హిమాచల్ ప్రదేశ్ - బీజేపీ 4.. జమ్మూకశ్మీర్ - కాంగ్రెస్ 2, బీజేపీ 2 స్థానాల్లో లీడ్ లో ఉంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు - ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో ఆధిక్యం అంటే.?

Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా ఎన్డీయే హవా కొనసాగుతోంది. బీజేపీ 226 స్థానాలు, కాంగ్రెస్ 98, ఎస్పీ 34, టీఎంసీ 24, డీఎంకే 19, టీడీపీ 15, జేడీయూ 13 స్థానాల్లో ముందంజలో ఉంది.

లక్ష దాటిన రాహుల్ గాంధీ ఆధిక్యం

Loksabha Election Results 2024: కేరళలోని వయనాడ్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 1,20,206 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు, రాయ్ బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై 68,789 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇక, అమేఠీలో కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై 23,428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ లో మాజీ సీఎం జోరు - కాంగ్రెస్ అభ్యర్థిపై 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యం

Loksabha Election Results 2024: మధ్యప్రదేశ్ లోని విదిశలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మపై 2,13,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

యూపీలో తలకిందులైన బీజేపీ అంచనాలు

Loksabha Election Results 2024: యూపీలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. కమలం పార్టీకి సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఎన్డీయే Vs I.N.D.I.A కూటమి టఫ్ ఫైట్ - కాంగ్రెస్ సీట్లు పెరిగాయ్

Loksabha Elections Results 2024: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే,  I.N.D.I.A కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీయే 288,  I.N.D.I.A కూటమి 225 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 105 సీట్లకు పెరిగింది.

చెన్నై సౌత్‌లో తమిళిసై వెనుకంజ

Loksabha Election Results 2024: చెన్నై సౌత్ లో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందర్ రాజన్ వెనుకంజలో ఉన్నారు.

వారణాసిలో ప్రధాని మోదీ ముందంజ - ఎన్ని ఓట్ల ఆధిక్యం అంటే.?

Loksabha Election Results 2024: వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. 21 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ

Loksabha Election Results 2024: అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ దాదాపు 15 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఒడిశాలో బీజేపీ సత్తా

Loksabha Election Results 2024: ఒడిశాలో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 147 స్థానాలుండగా.. బీజేపీ 33, బీజేడీ 14, కాంగ్రెస్ 5, ఇతరులు1 స్థానంలో లీడింగ్ లో కొనసాగుతున్నారు.

కర్ణాటకలో ప్రజ్జ్వల్ రేవణ్ణకు ఆధిక్యం

Loksabha Election Results 2024: కర్ణాటకలోని హాసన్ లో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్జ్వల్ రేవణ్ణ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం.పాటిల్ పై 2,369 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా, ఇటీవలే మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలతో రేవణ్ణ అరెస్టయ్యారు.

వారణాసిలో మోదీ ఆధిక్యం

Loksabha Election Results 2024: వారణాసిలో ప్రధాని మోదీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

279 స్థానాల్లో ఎన్డీయే లీడ్ - కాంగ్రెస్ 186 చోట్ల ఆధిక్యం

సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 279 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 186 చోట్ల ఆధిక్యంలో ఉంది. అటు, ఇతరులు 55 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

లోక్ సభ ట్రెండ్స్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే

దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. లోక్ సభ ట్రెండ్స్‌లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అటు వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ లీడ్ లో ఉన్నారు. వయనాడ్, రాయ్ బరేలీలో రాహుల్ ఆధిక్యంలో ఉన్నారు. అటు, యూపీలో బీజేపీ వెనుకంజలో ఉంది.

వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ - కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నారు. 6,223 ఓట్ల వెనుకంజలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్డీయే 275 స్థానాల్లో లీడ్ - I.N.D..I.A కూటమి 201 స్థానాల్లో లీడ్

ఎన్డీయే 275 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. I.N.D..I.A కూటమి 201 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎన్డీయే మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది.

యూపీలో టఫ్ ఫైట్ - ఎస్పీ, బీజేపీ మధ్య హోరాహోరీ

యూపీలో టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఎస్పీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ, ఎస్పీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఎస్పీ 32 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఎన్డీయే, I.N.D.I.A కూటమి మధ్య టఫ్ ఫైట్ - నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ ఎన్డీయే, I.N.D.I.A కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్ల నష్టంలో ఉంది.

ఒడిశాలో బీజేపీ 5 స్థానాల్లో లీడ్ - బీజేడీ 4 స్థానాల్లో ఆధిక్యం

ఒడిశాలో బీజేపీ 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అటు బీజేడీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండుచోట్ల ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్ లో, యూపీలోని రాయ్ బరేలీలో రాహుల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కేరళలో కేంద్ర మంత్రి వెనుకంజ

కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, త్రిశ్సూర్ లో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి వెనుకంజలో ఉన్నారు.

దేశంలో ఎన్డీయే జోష్ - ఈ స్థానాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు వెనుకంజ

తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజలో ఉండగా.. అటు చెన్నై సౌత్ లో తమిళిసై సౌందర్ రాజన్ సైతం వెనుకంజలో ఉన్నారు. అలాగే, బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీ చేస్తోన్న పన్నీర్ సెల్వం కూడా వెనుకబడ్డారు.

ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు - ఏ స్థానాల్లో లీడ్ అంటే?

దేశవ్యాప్తంగా ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్, ఘజియాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి, గోరఖ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్ ఆధిక్యంలో ఉన్నారు. అటు, గాంధీనగర్ నుంచి అమిత్ షా ముందంజలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్డీయే జోష్ - 369 సీట్లలో ఆధిక్యం

దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 369 సీట్లలో తొలి ట్రెండ్స్ వెలువడగా.. ఎన్డీయే 241 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. I.N.D.I.A కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 33 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.

కౌంటింగ్ క్షణక్షణం ఉత్కంఠ - వారణాసిలో మోదీ, రాయ్ బరేలీలో రాహుల్ ఆధిక్యం

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, రాయ్ బరేలీలో రాహుల్ గాందీ, మండిలో కంగనా రనౌత్, కోయంబత్తూరులో బీజేపీ అన్నామలై, యూపీలోని మైన్‌పురిలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్, బెంగాల్ లోని డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ లీడింగ్ లో ఉన్నారు. అటు, విదిశాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు.

ఢిల్లీలో ఏడు సీట్లలో బీజేపీ లీడ్‌

దేశ రాజధాని ఢిల్లీలో ఏడు సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక్కడ సీఎం కేజ్రీవాల్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్‌ లెక్కిస్తున్నారు. ఇందులో బీజేపీదే పైచేయిగా ఉంది.

తొలి ట్రెండ్స్‌లో ఎన్డీయే ఆధిక్యం - వారణాసిలో మోదీ మేనియా

దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఎన్డీయే 6 సీట్లు, I.N.D.I.A కూటమికి 2 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి. వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం - క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తించే ఫలితాలు ఇక్కడ చూడండి

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఉదయం 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.

లెక్కింపు మొదలుకాకుండానే ఖాతా తెరిచిన ఎన్ డి ఏ

2024 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్డీఏ విన్నింగ్ రైట్ ముకేశ్ దళాలతోనే మొదలైంది. అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ జరగకుండానే ఎన్డీఏ ఖాతా తెరిచింది

Background

Lok Sabha Election Results 2024 LIVE Updates: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఎవరి భవిష్యత్‌ ఏంటో తేలిపోనుంది. ఏపీలో మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్ సభతో పాటు మొత్తం 543 లోక్ సభ స్థానాలకు మంగళవారం (జూన్ 4) కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఏ గట్టున ఎవరో జూన్ 4న తెలిసిపోనుంది.


ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు... అధికారాన్ని స్థాపించేది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అటు, కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలు, సహా రాష్ట్రాల పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.


 



 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.