Malli Pelli Teaser : 'మళ్ళీ పెళ్లి' - ఇది సినిమానా? లేదంటే నరేష్ - పవిత్ర జీవితమా?

Naresh Pavitra's Malli Pelli Teaser released : నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటిస్తున్న సినిమా 'మళ్ళీ పెళ్లి'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది చూస్తే ప్రేక్షకులకు చాలా సందేహాలు కలుగుతాయి. 

Continues below advertisement

నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie 2023). ఇందులో ఆయనకు జోడీగా, కథానాయికగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. 

Continues below advertisement

'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే... ఇది నిజంగా సినిమా టీజరా? లేదంటే నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన కొన్ని రోజుల క్రితం సంఘటనలను రీ క్రియేట్ చేశారా? అనే సందేహం కలుగుతుంది.

సినిమా కాదిది... జీవితమే!
నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఏంటి? తెలుసుకోవాలని తెలుగు ప్రజలు, కన్నడ రాష్ట్రంలో కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనేది అందరికీ తెలిసిందే. నరేష్, పవిత్ర సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుగు  కూస్తోంది. ఆ ప్రచారానికి తోడు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో హై డ్రామా నడిచింది. తమకు మద్దతు ఇవ్వాలని పవిత్రా లోకేష్ ప్రేక్షకులను కోరారు.   

'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే... అవన్నీ గుర్తుకు వస్తాయి. మరోసారి ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడతాయి. నరేష్, పవిత్రా లోకేష్ రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూస్తే... రమ్యా రఘుపతి పాత్రలో నటి వనితా విజయ్ కుమార్ యాక్ట్ చేసినట్టు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇది సినిమా కాదు, నరేష్ - పవిత్ర బయోపిక్ అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదీ సంగతి!  ఒక్క విషయంలో నరేష్ సక్సెస్ అయ్యారు... తనపై వచ్చిన ఆరోపణలకు సినిమా ద్వారా బదులు ఇవ్వడంలో! 

ప్రేక్షకుల్లో నరేష్, పవిత్ర మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం థియేటర్లకు రప్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమాకు నిర్మాత కూడా నరేష్ కాబట్టి... వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలకు బదులు ఇవ్వడమే కాదు, దాన్ని క్యాష్ కూడా చేసుకుంటున్నారని అనుకోవాలి. 

Also Read : 'విరూపాక్ష' రివ్యూ : మిస్టీక్ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?

తెలుగు, కన్నడ భాషల్లో... 
'మళ్ళీ పెళ్లి' సినిమాకు మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం అందింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్‌ సంస్థను పున:ప్రారంభించారు. విడుదల చేయనున్నట్లు నరేష్ తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఆయన తెలిపారు. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది.

Also Read రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : జునైద్ సిద్ధిక్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి, సాహిత్యం : అనంత శ్రీరామ్. 

Continues below advertisement