Ravi Teja Sharwanand : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్

రవితేజ, శర్వానంద్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల క్రితం వినిపించింది. ఆ సినిమా ఫిక్స్ అయ్యింది. దానికి దర్శకుడు ఎవరు? నిర్మాణ సంస్థ ఏది? అంటే...

Continues below advertisement

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి, మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు ఎటువంటి అభ్యంతరం లేదు. కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చితే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన బ్లాక్ బస్టర్ 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవితో రవితేజ నటించారు. కెరీర్ స్టార్టింగులోనూ ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు, స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత మల్టీస్టారర్స్ మీద దృష్టి పెట్టినట్లు ఉన్నారు.

Continues below advertisement

శర్వాతో కలిసి... రవితేజ సినిమా!
యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand)తో కలిసి రవితేజ ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని తెలిసింది. కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ ఓ సినిమా చేస్తారనే వార్తలు వినబడుతున్నాయి. లేటెస్ట్ అండ్ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఆ సినిమాకు దర్శకుడు, నిర్మాణ సంస్థ ఖరారు అయ్యాయి. అన్నీ సెట్ అయ్యాయి. ఇక సెట్స్ మీదకు వెళ్ళడమే ఆలస్యం అని తెలిసింది. 

'కలర్ ఫోటో' సందీప్ రాజ్ దర్శకత్వంలో...
Sandeep Raj to direct Ravi Teja, Sharwanand : రవితేజ, శర్వాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నారు. తన కథతో ఇద్దరు హీరోలనూ అతను మెప్పించారు. 'కలర్ ఫోటో' సినిమాతో సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాకు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టారు. 

'కలర్ ఫోటో' అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాదు... దర్శకుడిగా సందీప్ రాజ్ (Sandeep Raj)కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించబోయే సినిమా రవితేజ, శర్వాదే. మధ్యలో 'హెడ్స్ అండ్ టేల్స్', 'ముఖ చిత్రం' సినిమాలకు సందీప్ రాజ్ స్క్రిప్ట్స్ అందించారు. ఆయన డైలాగులకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

జీ స్టూడియోస్ నిర్మాణంలో... 
రవితేజ, శర్వానంద్, సందీప్ రాజ్ కలయికలో సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. తొలుత రెండు మూడు నిర్మాణ సంస్థలు ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపించాయట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, భారీ ఎత్తున ఖర్చుకు రాజీ పడకుండా నిర్మించేలా జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ & స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని టాక్. త్వరలో సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 

Also Read న్యాయ 'వ్యవస్థ'లో రైట్ రాంగ్ ఏమీ ఉండదు - హెబ్బాతో కార్తీక్ రత్నం, కామ్నా

Ravi Teja Upcoming Movies : ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు', కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' సినిమాలు చేస్తున్నారు రవితేజ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి హీరోల చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అయ్యాక సందీప్ రాజ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళవచ్చు. 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమిళ హిట్ 'మానాడు'ను రీమేక్ చేయడానికి కూడా రవితేజ అంగీకరించారని తెలిసింది. అందులో బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ మరో హీరో. ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇప్పుడు ఆ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించలేదు.   

Also Read రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్

Continues below advertisement
Sponsored Links by Taboola