ప్రభు శ్రీరామ్ పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. జానకి దేవి అలియాస్ సీతగా కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
సినిమా టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్ అయితే అన్నీ ఇన్నీ కాదు. ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం దర్శకుడిని ఓ ఆట ఆడుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అతడికి అమితమైన సంతోషం కలిగించే పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
ట్రిబెకా చిత్రోత్సవంలో 'ఆదిపురుష్'
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పలు చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రతిష్టాత్మకంగా భావించేవి కొన్ని ఉంటాయి. అందులో ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival 2023) ఒకటి. అందులో ప్రదర్శనకు 'ఆదిపురుష్' సినిమా ఎంపిక అయ్యింది. దర్శకుడు ఓం రౌత్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు ట్రిబెకా చలన చిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో జూన్ 13వ తేదీన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. దాంతో సినిమా షోలు మొదలు అవుతాయని చెప్పవచ్చు.
Also Read : న్యాయ 'వ్యవస్థ'లో రైట్ రాంగ్ ఏమీ ఉండదు - హెబ్బాతో కార్తీక్ రత్నం, కామ్నా
త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల
జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్. అయితే, వివాదాల నేపథ్యంలో విడుదల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్
టీజర్ విడుదల తర్వాత సినిమాపై ట్రోల్స్ ఎక్కువ వచ్చాయి. అందుకని, మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేయడం కోసం విడుదల వాయిదా వేశారు. ఆ వివాదం పక్కన పెడితే... శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కొత్త వివాదానికి కారణం అయ్యింది. ఆ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ముంబై నివాసి సంజయ్ దీనానాథ్ తివారి ఆరోపిస్తున్నారు. సకినాక పోలీస్ స్టేషనుకు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో వెళ్లి కంప్లైంట్ చేశారు. 'ఆదిపురుష్' పోస్టర్‌లో ప్రభాస్ ధరించినట్టు శ్రీరాముడు వేషధారణ ఉండదని, ఆయన సహజ స్వరూపానికి భిన్నంగా దర్శకుడు చూపిస్తున్నారని, హిందూ సంస్కృతిలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చిత్రపటానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, దాన్ని తప్పుగా చూపించడం ద్వారా హిందువుల మనోభావాలను గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.