సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు ‘ఏజెంట్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేశాయి. మంగళవారం కాకినాడ వేదికగా విడుదల చేసిన ట్రైలర్‌ను చూస్తే తప్పకుండా అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో లవర్‌ బాయ్‌గా ఆకట్టుకున్న అఖిల్.. ‘ఏజెంట్’ మూవీలో పూర్తిగా డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సరికొత్త హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో వైల్డ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే.. అఖిల్ ఈ మూవీతో హిట్ కొట్టేందుకు ఎంత పట్టుదలతో ఉన్నాడనేది అర్థమవుతుంది. 


వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. 'ది మోస్ట్ నోటోరియస్.. మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్‌తో వదిలిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది చెప్పేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మొత్తం మరింత ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అంతేకాదు, అఖిల్ క్యారెక్టర్‌ కూడా ఆసక్తిగా, ఎనర్జిటిక్‌గా ఉంది.


‘ఏజెంట్’ ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి



ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక డ్రోన్ షాట్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత ‘‘నన్ను ఏజెంట్‌గా ఎందుకు కోరుకుంటున్నారు’’ అంటూ అఖిల్ డైలాగ్ వినిపిస్తుంది. ఆ తర్వాత ట్రైలర్‌ కథలోని కీలక అంశాల్లోకి వెళ్తుంది. ‘‘సిండికేట్‌కు ఒక పవర్ హౌస్ ఉంది, అదే గాడ్. దాన్ని ట్రేస్ చేయగలిగితే మొత్తం నెట్‌వర్క్ నాశనం చేయొచ్చు’’ అనే డైలాగ్ వస్తుంది. అనంతరం విలన్ ఎంట్రీ.. ‘‘ఆకలితో ఉన్న పులి.. ఈ సింహాన్ని వేటాడానికి వస్తుంది’’ అనగానే మమ్మూటి స్క్రీన్‌పై కనిపించారు. ఆ తర్వాత అఖిల్‌కు అప్పజెప్పిన ఆపరేషన్ సక్సెస్ పర్శంట్ ఎంత అని  


ఈ ఆపరేషన్ సక్సెస్ పర్శంట్ ఎంత శాతం అని డిఫెన్స్ మినిస్టర్(?) అడిగే ప్రశ్నకు.. ‘రా’ అధికారి కేవలం 5 శాతమే ఉందని సమాధానం ఇస్తారు. ‘‘మరి ఏ కాన్ఫిడెన్స్‌తో ఇది స్టార్ట్ చేశారు’’ అని మంత్రి అడుగారు. సీన్ కట్ చేస్తే.. అఖిల్ మంచు వర్షంలో గొడుకు వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే కొన్ని ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. 


ఇంత పెద్ద మిషన్ హ్యాండిల్ చేయగలడా అనే ప్రశ్నకు.. మమ్మూటి బదులిస్తూ.. ‘‘సింహం బోనులోకి వెళ్లి తిరిగి వచ్చేది.. కేవలం కోతి మాత్రమే’’ అంటూ అఖిల్ క్యారెక్టర్ గురించి చెబుతాడు. ఆ తర్వాత వచ్చే సీన్‌లో ‘‘నీచ్ కమిన్ కుత్తే పనులు చేయాలంటే చాలా గట్స్ కావాలి. నా దృష్టిలో మనం అందరం రియల్ హీరోస్’’ అంటూ అఖిల్ సంతోషంగా తన టీమ్‌ను ఎంకరేజ్ చేయడాన్ని ట్రైలర్‌లో చూపించారు. ‘‘స్పై అంటే బుల్లెట్లు వర్షంలా కురుస్తాయి. ఏ బుల్లెట్ మీద నీ పేరు రాసి ఉంటుందో నీకే తెలీదు’’ అంటూ మమ్మూటి చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ముగిసింది.  


సుమారు రెండేళ్లుగా చిత్రీకరిస్తున్న ఈ మూవీ గతేడాది ఆగస్టు 12నే విడుదల కావల్సి ఉండేది. కానీ, అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న మూవీని విడుదల చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్‌: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్‌: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి. 


‘ఏజెంట్’ ట్రైలర్ రిలీజ్ లైవ్ (కాకినాడ):



Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?