Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై కేసు పెట్టడానికి ముందు అమీర్ ఖాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అని నటి కంగనా రనౌత్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ టీవీ షో 'సత్యమేవ్ జయతే' ఎపిసోడ్‌లో పార్టిసిపేట్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.


నటులు, రాజకీయ నాయకులు అని తేడా లేకుండా ఎవరిపై పడితే అలా, ఎలా అంటే అలా చెప్పాలనుకున్నది ముక్కు సూటిగా మనస్తత్వం గల బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. అలా పలు అంశాలపై స్పందించి, ఎన్నో సార్లు ట్రోలింగ్ కి, వివాదాస్పదంగానూ మారారు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె.. ఎంత మంది నిందించినా, తప్పుగా కామెంట్ చేసినా తన స్టైల్లో సమాధానం ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫ్యాన్ పేజీ నుంచి ఓ స్టోరీని షేర్ చేశారు.  అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన 'సత్యమేవ జయతే' ఎపిసోడ్‌లో పాల్గొన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ వీడియోలో ఐటెం సాంగ్ లకు తాను నో చెప్పడంపై క్లారిటీ ఇచ్చారు.  


నటీమణులు దీపికా పదుకొణె, పరిణీతి చోప్రాతో కలిసి ఎపిసోడ్ కు వచ్చిన కంగనా.. అక్కడ ఆమె తన స్నేహితుడి చిన్న కుమార్తె ఒక ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేయడం చూసింది. ఆ తర్వాత తాను అలాంటి సాంగ్స్ కు నో చెప్పడానికి గల కారణాన్ని వివరించింది. దాంతో పాటు నిజం చెప్పాలంటే అప్పుడు అమీర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని రాసుకొచ్చింది. ‘‘హృతిక్ నాపై ఆ చట్టపరమైన కేసు ఫైల్ చేయడానికి ముందు, అమీర్ నాకు మార్గదర్శకత్వం చేశాడు, నన్ను అభినందించాడు, నా ఆలోచనలకు ఓ రూపం తీసుకొచ్చాడు అని కంగనా చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు తనకు అమీర్ ఖాన్ బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్న ఆ రోజులు కూడా గుర్తుకొస్తాయి. ఆ రోజులు ఎక్కడికి పోయాయో తెలియదంటూ ఆమె చెప్పారు. కానీ ఆ తర్వాత అతని లాయాల్టీ ఏంటో తెలిసింది. సినీ పరిశ్రమ అంతా ఓ మహిళకు వ్యతిరేకంగా నిలబడింది’’ అని చెప్పుకొచ్చింది.


2016-2017 సమయంలో కంగన, హృతిక్ మధ్య ఒక పెద్ద లీగల్ వార్ నడిచిన విషయం తెలిసిందే. హృతిక్, తాను డేటింగ్ చేసినట్లు ఆమె మీడియాకు వెల్లడించగా.. హృతిక్ చాలాసార్లు ఆ ఈ విషయాన్ని ఖండిస్తూ వచ్చాడు. చివరికి 2020లో హృతిక్ రోషన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసు సైబర్ సెల్ నుంచి క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చేంజ్ అయినపుడు హృతిక్ 'మూవ్ ఆన్' అని కంగనా ట్వీట్ చేసింది. 


ఇక కంగనా రనౌత్ సినిమా విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె డైరెక్టర్ గా పరిచయం కాబోతుంది. ఈ మూవీలో ఆమె భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 1970ల మధ్యలో భారతదేశంలోని ఎమర్జెన్సీ కాలం ఆధారంగా రూపొందించబడనుంది. దాంతో పాటు  తేజస్, చంద్రముఖి 2, మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా కూడా లైనప్ లో ఉన్నాయి.


Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?