NBK Veera Simha Reddy : వంద రోజుల 'వీర సింహా రెడ్డి' - బాలకృష్ణ సినిమా గ్రాండ్ ఫంక్షన్ ఎప్పుడంటే?

Veera Simha Reddy 100 Days Celebrations : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' సినిమా వంద రోజుల వేడుకను భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Continues below advertisement

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట విశ్వరూపం చూపించిన సినిమాల్లో 'వీర సింహా రెడ్డి' కూడా ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైంది. అటు అభిమానులు మెప్పించింది. ఇటు వసూళ్ళ పరంగా మంచి విజయం సాధించింది. ఫ్యాక్షన్ ఫిలిమ్స్, ఫ్యాక్షన్ లీడర్ రోల్స్ అంటే... బాలకృష్ణ విజృంభిస్తారు. 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie)లోనూ విజృంభించి నటించారు. ఇప్పుడీ సినిమా వంద రోజుల వేడుకకు సిద్ధమైంది.

Continues below advertisement

'వీర సింహా రెడ్డి' విజయోత్సవం...
ఏప్రిల్ 23న వంద రోజుల వేడుక!
100 Days Celebrations of VEERA MASS BLOCKBUSTER Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా జనవరి 22న 'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ నెల 22కి సినిమా విడుదలై వంద రోజులు పూర్తి అవుతుంది. ఆ తర్వాత రోజు... ఏప్రిల్ 23న వంద రోజుల వేడుక నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఫంక్షన్ ఎక్కడ నిర్వహించేది అతి త్వరలో తెలియజేస్తామని వారు ప్రకటించారు. 

Also Read : కోబలి - ఇది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా కాదు!

'వీర సింహా రెడ్డి' విజయంలో యాక్షన్ సన్నివేశాలు, బాలకృషను దర్శకుడు గోపీచంద్ మలినేని చూపించిన తీరు ముఖ్య భూమిక పోషించాయి. 'క్రాక్' విజయం తర్వాత మలినేని తెరకెక్కించిన చిత్రమిది. 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్రమూ ఇదే. ఇందులో ఫైట్స్ బావున్నాయని, 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమని రివ్యూ రైటర్లతో పాటు ప్రేక్షకులు చెప్పారు.

బాలకృష్ణకు జోడీగా శ్రుతీ హాసన్ (Shruti Hassan), హనీ రోజ్ కథానాయికలుగా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.

వంద కోట్ల 'వీర సింహా రెడ్డి'!
ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే కాదు... బాక్సాఫీస్ బరిలో 'వీర సింహా రెడ్డి'కి మంచి వసూళ్లు సైతం వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది. చిత్ర నిర్మాతలకు ఈ సినిమా లాభాలు అందించింది.

ఓటీటీలోనూ మంచి వ్యూస్!
'వీర సింహా రెడ్డి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 23న సాయంత్రం ఆరు గంటలకు ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసింది. బాలకృష్ణ అభిమానుల కోసం ఒక స్పెషల్ యాంథమ్ కూడా విడుదల చేసింది. ఓటీటీలోనూ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో సినిమాను ప్రదర్శించారు. డిజిటల్ తెరలో 'వీర సింహా రెడ్డి' అందుబాటులో ఉన్నప్పటికీ... వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు కొందరు ఆసక్తి కనబరచడం విశేషం.  

Also Read రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్

Continues below advertisement