Aarti Mittal: ముంబైలో వ్యభిచార రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలపై 27 ఏళ్ల ఫిమేల్ కాస్టింగ్ డైరెక్టర్ (female casting director) ఆర్తి మిట్టల్‌ (Aati Mittal)ను దిండోషి పోలీసులు (Dindoshi Police) అరెస్టు చేశారు. ముంబై పోలీసుల సోషల్ సర్వీస్ బ్రాంచ్ ఇద్దరు డమ్మీ కస్టమర్‌లను పంపి ఇద్దరు మోడల్‌లను రక్షించింది. సోషల్ సర్వీస్ బ్రాంచ్ మొత్తం విచారణను నిర్వహించి, సంఘటనకు సంబంధించిన వివరాల వీడియోను సాక్ష్యంగా రికార్డ్ చేసింది.


27 ఏళ్ల ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్ వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సినిమాలో అవకాశాల కోసం వస్తున్న కస్టమర్లకు మోడల్స్ ను పంపుతున్నట్లు తెలియడం పోలీసులు.. ఆమెపై నిఘా ఉంచారు. ముంబైకి చెందిన సోషల్ సర్వీస్ బ్రాంచ్ పోలీసులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధరించకున్న తర్వాత దాడులు చేశారు. ఇద్దరు మోడల్స్ ను రక్షించి, పునరావాస కేంద్రానికి పంపారు.


ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేశారు. నిందితురాలు ఆర్తి హరిశ్చంద్ర మిట్టల్ సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఓషివారాలోని ఆరాధనా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తారని పోలీసులు తెలిపారు.  ప్రాజెక్టుల పేరుతో మోడల్‌లను కలిసి వారికి డబ్బు ఆశ చూపి, వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఆర్తి వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ సుతార్‌ (Manoj Sutar)కు సమాచారం అందగా... అతను ఒక టీమ్‌గా ఏర్పడి ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కస్టమర్స్ తరహాలో ఆర్తి దగ్గరికి పంపించాడు. సుతార్ తన స్నేహితులకు ఇద్దరు అమ్మాయిలు కావాలని, హోటల్‌కు పంపాలని వారు ఆర్తిని కోరారు. ఇందుకు ఆమె రూ.60వేలు డిమాండ్ చేసింది.


ఆర్తిని పోలీసులు ఎలా పట్టుకున్నారు.. ?


ఆర్తి.. సుతార్‌కు ఫోన్‌ చేసి ఇద్దరు మహిళల ఫొటోలు పంపారు. వారిద్దరూ గోరేగావ్ లో ఉన్న ఓ హోటల్ కు వస్తారని చెప్పింది. ఆ తర్వాత సుతార్ హోటల్ లో రెండు గదులను బుక్ చేసి ఇద్దరు కస్టమర్‌లను (ఇన్‌స్పెక్టర్లను) పంపించాడు. ఆర్తి మోడల్స్‌తో వచ్చినప్పుడు, వారికి కండోమ్‌లు కూడా ఇచ్చింది, అవన్నీ స్పై కెమెరాలలో రికార్డయ్యాయి.


అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తెలియగానే.. ఎస్ఎస్ బ్రాంచ్ హోటల్‌పై దాడి చేసింది. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారు దిండోషి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఆర్తి మిట్టల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  మోడల్స్ కు ఆర్తి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి్నట్టు విచారణలో తేలింది.


ఆ తర్వాత మిట్టల్‌పై ఐపీసీ సెక్షన్ 370తో పాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆర్తి మిట్టల్ టెలివిజన్ షో అప్నాపన్‌లో రాజశ్రీ ఠాకూర్‌తో కలిసి పనిచేశారు. అరెస్టకు ముందు ఆమె హీరో ఆర్ మాధవన్‌తో (Madhavan) కలిసి ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?