ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాల్లో 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ - They Call Him OG) ఒకటి. దీనికి పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. గత శనివారం ముంబైలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.


ముంబై వెళ్లిన పవన్...
ఆయనకు స్పెషల్ ఫ్లైట్!
'ఓజీ' రెగ్యులర్ షూటింగ్ మొదలైందని చెప్పిన రోజే... వచ్చే వారంలో పవన్ కూడా షూటింగులో జాయిన్ అవుతారని చిత్ర బృందం పేర్కొంది. ఆ రోజు రానే వచ్చింది. సోమవారం స్పెషల్ ఫ్లైట్ ఎక్కి మరీ పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. ఈ రోజు నుంచి 'ఓజీ' చిత్రీకరణలో ఆయన పాల్గొంటారు. వీకెండ్ వరకు షూటింగ్ చేస్తారట. పవన్ వచ్చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇతర నటీనటుల మీద సన్నివేశాలు తీయడానికి దర్శకుడు సుజీత్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరు? అనేది ఇంకా వెల్లడించలేదు. త్వరలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే భామ పేరు రివీల్ చేస్తారట. 


పదిహేను సార్లు క్లైమాక్స్ మార్చిన సుజీత్!
షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. 


ముంబైలో సీన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ!
వీడియో ప్రారంభంలో ఓ సీన్ పేపర్ వస్తుంది. ఒక ప్రయివేట్ పోర్టులో, ఒక పెద్ద ఐరన్ గేటు ముందు, పోర్టులో ఎంటర్ అయ్యే దారిలో వందల మంది గన్నులతో నిలబడతారు. అందులో ఇద్దరి పేర్లు డంగి, ఫైజల్! ఇక్కడికి రావాలని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఉండదని డంగి అంటాడు. 


బుల్లెట్ సౌండ్ వినిపించడంతో డంగి, ఫైజల్... ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళ ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఆ పొగ లోంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశం లోనుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు. ఇదీ సీన్! ముంబైలో హీరో ఇంట్రడక్షన్ అనుకుంట! ఇది పవర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది. 


Also Read : ఇలియానా స్వీట్ సర్‌ప్రైజ్ - పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్?


వీడియోలో వినిపించిన తమన్ సంగీతం సైతం సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ వీడియోను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. బాల్ బాంబ్ కావడం, పెన్సిల్స్ బుల్లెట్స్ అవ్వడం, స్కేల్ జపనీస్ స్వార్డ్ కింద మారడం చూస్తుంటే... సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది, పవన్ కళ్యాణ్ ఎన్ని వెపన్స్ వాడతారనేది ఈజీగా అర్థం అవుతోంది.  


Also Read ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్