ఇప్పుడు కోర్టు రూమ్ డ్రామాలకు ఆదరణ బావుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' నుంచి 'అల్లరి' నరేష్ 'నాంది' వరకు... ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ వంతు వచ్చింది. కోర్టు రూమ్ డ్రామాలు డిజిటల్ తెరలోనూ వస్తున్నాయి. ఆ కోవలో సిరీస్ ఇది. 


ఆనంద్ రంగా న్యాయ 'వ్యవస్థ'
Vyavastha On Zee5 : ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'వ్యవస్థ'. ఇందులో కార్తీక్ రత్నం (Karthik Rathnam), సంపత్ రాజ్ (Sampath Raj), హెబ్బా పటేల్ (Hebah Patel) ప్రధాన తారాగణం. జీ 5 ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. 

ఓటీటీ కోసం వెబ్ సిరీస్ తీయడం ఆనంద్ రంగా (Anand Ranga)కు కొత్త ఏమీ కాదు. ఇంతకు ముందు 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' తీశారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన ఆ సిరీస్ సైతం 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జీ 5 కోసం ఆనంద్ రంగా మరో సిరీస్ తీశారు. 


ఇక్కడ రైట్, రాంగ్ ఏమీ ఉండదు!
Vyavastha Trailer : 'వ్యవస్థ' ట్రైలర్ ఏప్రిల్ 19 (రేపు) విడుదల చేయనున్నారు. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు. అందులో కార్తీక్ రత్నం ఉన్నారు. తల పైకి ఎత్తు చూస్తే... ఆయన కంటే ఎంతో ఎత్తులో ఉన్న మనిషి ఉన్నారు. ఆ కాళ్ళు ఎవరివి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'ఇక్కడ రైట్ రాంగ్ ఏమీ ఉండదు' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు తప్పు ఒప్పుల కంటే సాక్ష్యాలు ముఖ్యం అని చెప్పాలని అనుకుంటున్నారేమో!?


కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ!
గోపీచంద్ 'రణం' సినిమాలో కథానాయికగా నటించిన కామ్నా జెఠ్మలానీ గుర్తు ఉన్నారా? పెళ్లి తర్వాత, పిల్లలకు జన్మ ఇచ్చాక... యాక్టింగుకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడీ 'వ్యవస్థ'తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. 


Also Read రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్






'కుమారి 21 ఎఫ్' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ హెబ్బా పటేల్. ఆల్రెడీ ఆమె ఓ వెబ్ సిరీస్ చేశారు. అందులో గ్లామర్ డాల్ రోల్ అని చెప్పాలి. అయితే, 'వ్యవస్థ'లో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు సొంతం చేసుకున్న కార్తీక్ రత్నం కూడా ఇంతకు ముందు వెబ్ సిరీస్ చేశారు. 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి'లో ఆయన నటించారు. 


అసలు ఏముంటుందీ న్యాయ 'వ్యవస్థ'లో?
ఆనంద్ రంగా పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సిద్ధార్థ్ హీరోగా ఆయన తీసిన 'ఓయ్' సినిమా! దాని తర్వాత కొన్నాళ్ళు ఆయన మెగాఫోన్ పట్టలేదు. కానీ, కొన్ని సినిమాలకు తెర వెనుక వర్క్ చేశారు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల అయ్యింది) సినిమాకు ఆయన స్క్రిప్ట్ పరంగా చాలా హెల్ప్ చేశారు. తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ ఆయనే డైరెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి. ఆ విధంగా మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా మారారు. ఓటీటీకి వచ్చేసరికి దర్శకుడిగా ఆయన పంథా మారింది. రొమాంటిక్, లవ్ స్టోరీలు కాకుండా కొత్త కథలు ఎంపిక చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలు ఏముంటుందీ న్యాయ 'వ్యవస్థ'లో అని ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.


Also Read కోబలి - ఇది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా కాదు!