సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సోమవారం రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఎప్పటిలా ఆయన హ్యాండ్సమ్ గా ఉన్నారు. అంతేనా? ఫోటోలు చూస్తే... ఎంతో సరదాగా కనిపించారు. టీనేజ్ కుర్రాడిలా ఎంజాయ్ చేశారని అర్థం అవుతోంది. పదకొండేళ్ల కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni)తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ నమ్రత సైతం పోస్ట్ చేశారు. అసలు, ఇంతకీ వీళ్ళు వెళ్ళింది ఎవరి పార్టీకో తెలుసా?


శ్రియా భూపాల్ సీమంతంలో మహేష్ సందడి!
ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ (Shriya Bhupal) సీమంతం వేడుకలో మహేష్ బాబు ఫ్యామిలీ సందడి చేసింది. వ్యాపారవేత్త అనిందిత్ రెడ్డితో జూలై 6, 2018లో ఆమె వివాహం జరిగింది. ఆ పెళ్ళికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు సహా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరు అయ్యారు. అసలు, ఈ శ్రియా భూపాల్ ఎవరో గుర్తు ఉన్నారా?


అఖిల్ అక్కినేని నిశ్చితార్థం గుర్తుందా?
అనిందిత్ రెడ్డితో వివాహానికి సుమారు రెండేళ్ల ముందు అఖిల్ అక్కినేనితో పెళ్లి పీటల వరకు వెళ్లారు శ్రియా భూపాల్. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే, ఏమైందో ఏమో? త్వరలో పెళ్లి జరుగుతుందని అనుకోగా, ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి గురించి అఖిల్ ఆలోచించలేదు. తన కెరీర్, సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పుడు శ్రియా భూపాల్ తల్లి కాబోతున్నారు. మహేష్ బాబు హాజరు కావడం, ఫోటోలు పోస్ట్ చేయడంతో ఆమె సీమంతం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది.


Also Read రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!  



ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు వస్తే... తండ్రి కృష్ణ జయంతి రోజున (మే 31) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే, వీడియో గ్లింప్స్ కూడా! మిర్చి కంటే ఘాటుగా మహేష్ బాబును త్రివిక్రమ్ ప్రజెంట్ చేశారని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 


Also Read ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?


మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


'గుంటూరు కారం'తో సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో 'అతడు', 'ఖలేజా' తర్వాత రూపొందుతున్న చిత్రమిది. దీనికి ముందుగా 'అమరావతికి అటు ఇటు' టైటిల్ పరిశీలనలో ఉందని వినిపించింది. మధ్యలో 'ఊరికి మొనగాడు' టైటిల్ కూడా రేసులోకి వచ్చింది. ఆ రెండూ కాకుండా 'గుంటూరు కారం' ఫిక్స్ చేశారు. అంతే కాదు... దీంతో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ కూడా పక్కన పెట్టారు.  కొన్నేళ్ళుగా 'అ' అక్షరంతో మొదలయ్యే టైటిళ్లకు త్రివిక్రమ్ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. దర్శకుడిగా మొదలైన 'నువ్వే నువ్వే', మధ్యలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలకు ఆయన 'ఆ' సెంటిమెంట్ చూడలేదు. మళ్ళీ ఈ సినిమాకు చూడలేదు.