లక్ష్మీ ప్రసన్న మంచు (Lakshmi Manchu) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆదిపర్వం' (Adiparvam Movie). ఎర్రగుడి కథ... అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ రోజు లక్ష్మీ మంచు (Lakshmi Manchu Birthday) పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  


ఇప్పటి వరకు లక్ష్మీ మంచు చేయనటువంటి పాత్ర
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మోరు', 'అరుంధతి' సినిమాల తరహాలో దైవం, దుష్ట శక్తి మధ్య చిత్రకథ జరుగుతుందని... మంచి - చెడు మధ్య జరిగే ఫైట్ సినిమాలో హైలెట్ అవుతుందని... ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమా రాలేదని 'ఆదిపర్వం' యూనిట్ సభ్యులు తెలిపారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మ వారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఈ సినిమా అని, గ్రాఫిక్స్ ప్రధానమైన సినిమా అని వివరించారు. 'ఆదిపర్వం' సినిమా 1974 - 1990 మధ్య కాలంలో జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల సమాహారంగా రూపొందుతోందని తెలిపారు.


Also Read : దోచుకున్న డబ్బును ఫ్యామిలీకి ఇవ్వలేదా? నాగేశ్వర రావు కుటుంబం పరిస్థితి ఇప్పుడెలా ఉంది?


దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... "మంచు లక్ష్మీ ప్రసన్న గారు ఇప్పటి వరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేశారు. ఆమె చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ 'ఆదిపర్వం'లో ఆవిడ రెండు ఫైట్స్ చేశారు. అవి సినిమాకు హైలెట్ అవుతాయి. లక్ష్మీ మంచు గారి కెరీర్ చూస్తే... ఎప్పటికీ గుర్తు ఉంచుకునే విధంగా ఆమె పాత్ర, సినిమా ఉంటాయి. అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో అనుకున్న స్థాయిలో నేను గొప్ప సినిమా తీశానని నమ్ముతున్నా'' అని అన్నారు.  


Also Read : బోయపాటికి తమన్ భారీ పంచ్ - అంత మాట అనేశారేంటి?






'ఆదిపర్వం'లో ఎమోషనల్ లవ్ స్టోరీ, హాయ్ వోల్టేజ్ యాక్షన్... రెండూ ఉంటాయని దర్శకుడు తెలిపారు. అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా (ఎఐ) ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రావుల వెంకటేశ్వర రావు చిత్ర సమర్పకులు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ... ''ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై... ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారే చిత్రమిది. మా దర్శకుడు  సంజీవ్ మేగోటి అద్భుతంగా తీశారు'' అని చెప్పారు. ఫైట్స్ అండ్ లవ్ స్టోరీ ప్రశంసలు అందుకుంటాయని సహ నిర్మాత గోరెంట శ్రావణి తెలిపారు.  



'ఆదిపర్వం' సినిమాలో లక్ష్మీ ప్రసన్న మంచు కాకుండా ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, 'జెమినీ' సురేష్, 'ఢిల్లీ' రాజేశ్వరి, హ్యారీ జోష్, 'జబర్దస్త్' గడ్డం నవీన్, యోగి క్రాంతి, మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, డీఎస్పీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial