ఐ డోంట్ కేర్... ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా! నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై మీ స్పందన ఏంటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణను అడిగితే... 'ఐ డోంట్ కేర్' అని సమాధానం ఇచ్చారు. ఆయన కొత్త సినిమా 'భగవంత్ కేసరి' క్యాప్షన్ 'బ్రో... ఐ డోంట్ కేర్'! ఆ మాట చెప్పారు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ కూడా ఆ మాట చెప్పారు.


'ఐ డోంట్ కేర్' అని ఆదివారం ఉదయం తమన్ ఓ ట్వీట్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీనును ఉద్దేశించి ఆయన ఆ ట్వీట్ చేశారని చాలా మంది భావన. ఎందుకు? ఏమిటి? అని అసలు వివరాల్లోకి వెళితే... 






తమన్ (Thaman)ను తక్కువ చేసిన బోయపాటి?
తమన్, దర్శకుడు బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్! తొలిసారి వాళ్లిద్దరూ 'సరైనోడు' సినిమాకు పని చేశారు. అందులో సాంగ్స్, నేపథ్య సంగీతం హిట్టు! ఆ తర్వాత బాలకృష్ణ 'అఖండ'కు కలిసి పని చేశారు. వాళ్ళ కలయికలో తాజాగా 'స్కంద' వచ్చింది.


'అఖండ' విజయంలో తమన్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించిందని అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో చాలా మంది చెప్పే మాట! తెరపై బాలకృష్ణ నటనకు, బోయపాటి సన్నివేశాలకు తమన్ నేపథ్య సంగీతం ప్రాణం పోసిందని ప్రశంసలు ఎన్నో వచ్చాయి. ఆ సంగీతం లేకపోయినా బావుంటుందని బోయపాటి చెప్పడం చాలా మందికి ఆశ్ఛర్యాన్ని కలిగించింది. 


'స్కంద' సంగీతం బాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాని బోయపాటి శ్రీనును తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా... ''బాలేకపోతే ముందు నేనే యాక్సెప్ట్ చేయను. మనం తీసిన దానికి కరెక్టుగా ఉందనేది నా ఫీలింగ్. అయితే, నా వరకు ఈ విమర్శ ఎక్కువ వచ్చింది. ఎక్కువ మంది మాట్లాడిన మాటల్లో సంగీతం బాలేదనే విషయం ఉంది. సినిమా విడుదలై ఏడెనిమిది రోజులు అవుతోంది. నేను ఇప్పటికీ తమన్ గారితో మాట్లాడలేదు'' అని చెప్పారు. మళ్ళీ ఒకసారి రీ రికార్డింగ్ చెక్ చేస్తానని అన్నారు.


Also Read : దోచుకున్న డబ్బుకు ఫ్యామిలీకి ఇవ్వలేదా? నాగేశ్వర రావు ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడెలా ఉంది?


'అఖండ' సినిమాకు తమన్ ప్రాణం పోశాడని బోయపాటి శ్రీనుకు గుర్తు చేయగా... ''ఆ సినిమా ఆర్ఆర్ లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. కల్ట్ ఉండటంతో అతను అద్భుతంగా చేయగలిగాడు'' అని చెప్పారు. బోయపాటి మాటలపై సోషల్ మీడియాలో కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడు తమన్ ట్వీట్ చేయడానికి కారణం కూడా అదే అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం 'భగవంత్ కేసరి' సినిమా విడుదల పనుల్లో ఉండటంతో తమన్ వరకు విమర్శను తీసుకు వెళ్లలేదని బోయపాటి చెప్పారు. అదే సమయంలో సినిమా హిట్ అని మొదటి ఫోన్ అతని నుంచి వచ్చిందన్నారు. 


Also Read : ఆరు నెలలు షూటింగుకు, ఆ తర్వాత ఆరు సీజీకి - మెగా ప్లానింగ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial