ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి (Lakshmi Manchu) ప్రధాన పాత్రలో రూపొందిన మైథలాజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'ఆదిపర్వం' (Adiparvam Movie). సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎఐ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా రూపొందింది. చిత్రకథ 1974 నుంచి 1992 మధ్య ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ఐదు భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా అన్విక ఆడియో ద్వారా పాటల్ని విడుదల చేశారు.



అమ్మవారిని నమ్ముకున్న భక్తురాలి కథ...
'ఆదిపర్వం' గురించి దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ''ఆదిపర్వం' - ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఒక భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఒక క్షేత్ర పాలకుడి కథ'' అని చెప్పారు. సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ  ముఖ్య అతిథులుగా 'ఆదిపర్వం ఆడియో విడుదల చేశారు.


''ప్రచార చిత్రాలతో పాటు పాటలు బాగున్నాయి. ఆడియో రిలీజ్ ట్రెండ్ ఇటీవల లేకుండా పోయింది. 'ఆదిపర్వం'లో పాటలకు బాణీలు అందించిన స్వరకర్తలతో పాటు గేయ రచయితలు, గాయని గాయకులను పిలిచి వాళ్లకు సముచిత గౌరవం ఇవ్వడమనే సత్సంప్రదయాన్ని మళ్లీ తీసుకురావడం అభినందనీయం'' అని అతిథులు పేర్కొన్నారు. 'ఆదిపర్వం' పాటలు చాలా బాగున్నాయని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.


Also Readశర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్‌ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?



సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... "సినిమాతో పాటలు ఇంత బాగా రావడానికి సహకరించిన మా ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని చెప్పారు. ఈ సినిమాతో పలువురు నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేస్తున్నామని ఆయన తెలిపారు.


Also Readప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ



Adiparvam Movie Cast And Crew: లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆదిపర్వం'లో ఆమె భర్తగా 'జెమిని' సురేష్ నటించారు. ఇంకా ఈ సినిమాలో శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కాత్రి, 'గడ్డం' నవీన్, 'ఢిల్లీ' రాజేశ్వరి, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర రావు, సాయి రాకేష్, వనితా రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సమర్పణ: రావుల వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం: ఎస్ఎన్ హరీష్, కళా దర్శకత్వం: కేవీ రమణ, సంగీతం: మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి - ఓపెన్ బనానా - లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్ - రాజాపురం శ్రీనాథ్ - ఊటుకూరు రంగారావు - మనేకుర్తి మల్లికార్జున - రాజ్ కుమార్ సిరా, కూర్పు: పవన్ శేఖర్ పసుపులేటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఘంటా శ్రీనివాస రావు, సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి - ప్రదీప్ కాటుకూటి - రవి దశిక - రవి మొదలవలస - శ్రీరామ్ వేగరాజు, నిర్మాత : ఎమ్.ఎస్.కె, రచన - దర్శకత్వం: సంజీవ్ కుమార్ మేగోటి.