Watch Pushpa 2 The Rule Special Song Promo: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఒక రేంజ్ ఉంటాయి. అందులోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో సుకుమార్ చేసే సినిమాల్లో సాంగ్స్ అంటే నెక్స్ట్ లెవెల్ రేంజ్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ కేర్ తీసుకుని చేస్తారు. 'పుష్ప 2: ది రూల్'లో స్పెషల్ సాంగ్ ప్రోమో అంతకు మించి అనే ఫీలింగ్ కలిగిస్తోంది.


కిస్సిక్... బన్నీతో శ్రీ లీల సాంగ్ ప్రోమో చూశారా?
Kissik Song Pushpa 2 The Rule: బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'పుష్ప: ది రైజ్'లో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ'ను స్టార్ హీరోయిన్ సమంత చేశారు. అది ప్రేక్షకులు అందర్నీ ఊపేసింది. మరి, 'పుష్ప'కు సీక్వెల్‌గా అల్లు అర్జున్, సుకుమార్ చేస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్'లో స్పెషల్ సాంగ్ అంటే అంచనాలు మరింత పెరుగుతాయి కదా. వాటిని 'కిస్సిక్...' అందుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


'కిస్సిక్...'లో యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్, డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన సాంగ్ ఫస్ట్ లుక్ వైబ్రెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. అది ఎలా ఉందో వినండి.



సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే హిట్టే!
'పుష్ప' ఫ్రాంచైజీలో సాంగ్స్ మాత్రమే కాదు... సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే కళ్ళు మూసుకుని మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఆయన మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' నుంచి 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' వరకు ప్రతి పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 


Also Readజీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?



పుష్ప 2 విషయానికి వస్తే... ఓపెనింగ్ డే రికార్డ్స్ గ్యారంటీ!
డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో 'పుష్ప 2: ది రూల్' సినిమాను విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 4న ఓవర్సీస్ మార్కెట్స్, ముఖ్యంగా అమెరికాలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఓపెనింగ్ డే రికార్డులు రావడం గ్యారంటీ.


Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?


Pushpa 2 Cast And Crew: అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్'లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ మరోసారి నటించారు. ఇందులో ఆయన నట విశ్వరూపం చూస్తారని నజ్రియా నజీమ్ చెప్పారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.