యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో పేజీలు అందరికీ తెలుసు. తండ్రి నాగర్జున, తల్లి లక్ష్మి వేరు పడటం నుంచి సమంతతో విడాకుల వరకు ప్రేక్షకులకు ఆయన గురించి అన్ని తెలుసు. రాబోయే ఏడాది ఆయన జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. వచ్చే సంవత్సరం చైతన్య జీవితంలో చాలా కీలకం.
ఒక వైపు పెళ్లి... మరోవైపు భారీ సినిమా!
నవంబర్ 23... ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు. నేటితో ఆయనకు 38 సంవత్సరాలు నిండాయి. ఇవాళ 39వ ఏట అక్కినేని వారసుడు అడుగు పెడుతున్నారు. ఈ ఏడాది అంతా ఆయన జీవితంలో సంతోషాలే అని చెప్పాలి. ఎందుకంటే...
నాగచైతన్య పెళ్లికి పట్టుమని 15 రోజుల సమయం లేదు. డిసెంబర్ 5న శోభిత దూళిపాళతో ఆయన ఏడు అడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు శోభితకు కోడలు హోదా ఇచ్చింది అక్కినేని కుటుంబం. ఏఎన్ఆర్ అవార్డు వేడుకల్లో తమ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దిగిన ఫోటోలు చోటు కల్పించింది. అదే విధంగా ఇప్పుడు ఇఫీకి వెళ్ళినప్పుడు తమ వెంట తీసుకు వెళ్లింది.
నాగ చైతన్య, శోభిత జంట చూడముచ్చటగా ఉందని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. వాళ్ళిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని పిల్లాపాపలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో భారీ బ్లాక్ బస్టర్ సినిమా ఉంది.
హీరోగాను మరో మెట్టు ఎక్కుతున్న నాగచైతన్య
హీరోగా కెరియర్ విషయానికి వస్తే... అక్కినేని నాగ చైతన్య మరో మెట్టు ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. నాగార్జున వీరాభిమాని, తనకు 'ప్రేమమ్' వంటి హిట్ సినిమా ఇచ్చిన చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేశారు.
ఫిబ్రవరి 7న తండేల్ సినిమా విడుదల కానుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు... పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీనికి ముందు చందూ మొండేటి తీసిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా హిట్. హీరోయిన్ సాయి పల్లవి నటించిన తాజా సినిమా 'అమరన్' 300 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో భారీ విజయం సాధించింది. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ సైన్స్. వీటిని పక్కన పెడితే... 'తండేల్' కథలో దేశభక్తి ఉంది. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?
అన్నిటికీ మించి నాగచైతన్య తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక రూరల్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్లు చూస్తే... ఆయన ఆ పాత్రలో జీవించారని అర్థమవుతోంది. తండేల్ ప్రచార చిత్రాలలో బ్లాక్ బస్టర్ కళ కనబడుతోంది. ఒక వైపు పెళ్లి... మరో వైపు బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా... నాగచైతన్య జీవితంలో ఫుల్ హ్యాపీస్ అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చైతూ మౌనమే ఆయనకు శ్రీరామరక్ష
అక్కినేని నాగ చైతన్య జీవితంలో ఏం జరిగినా... ఎప్పుడు తాను బాధ పడినట్లు గానీ, తన ఆవేదనను గానీ ప్రజలకు చూపించలేదు. విక్టిమ్ కార్డు ప్లే చేయలేదు. మౌనంగానే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆవేశపడలేదు. ఎదుట వ్యక్తిది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆయనలోని ఈ శాంత గుణం ప్రేక్షకులకు అమితంగా నచ్చుతోంది. ఆయన మౌనమే ఆయనకు శ్రీరామరక్ష.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?