'ఆర్ఆర్ఆర్'కు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిలో హాలీవుడ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ సి రాబర్ట్ గిల్, 'స్పైడ‌ర్‌మ్యాన్ వర్స్' రైటర్, ప్రొడ్యూసర్ క్రిస్టోఫర్ మిల్లర్ తదితర ప్రముఖులు నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' చూసి ట్వీట్స్ చేశారు. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... ఒక పోర్న్ స్టార్ సినిమా తనకు నచ్చిందని ట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. 


''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' చూశా. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన... పాటలు... ఫైట్లు... సినిమాటోగ్రఫీ... డైలాగ్ డెలివరీ... ప్రతిదీ పర్ఫెక్ట్. ఏం సినిమా అసలు! అద్భుతంగా ఉంది. హీరోలు ఇద్దరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'కు హీరోలు ఇద్దరి నటన ఆత్మ లాంటిది'' అని కేంద్రా లస్ట్ ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆమె ట్వీట్ ను లైక్ చేశారు. 



Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు



సోషల్ మీడియాలో చాలా మంది కేంద్రా లస్ట్ 'ఆర్ఆర్ఆర్' గురించి చేసిన ట్వీట్ మీద డిస్కషన్స్ చేస్తున్నారు. మరిన్ని ఇండియన్ సినిమాలు చూసి అభిప్రాయం చెప్పమని కొంత మంది కోరగా... దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తే బావుంటుందని ఇంకొంత మంది ట్వీట్ చేస్తుండటం విశేషం.


Also Read : జీవితం కంటే సినిమాలే ముఖ్యం - గాయాలను లెక్క చేయని రామ్