సినిమాలు ముఖ్యమా? జీవితం ముఖ్యమా? అని ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni)ని అడిగితే... 'సినిమాలే ముఖ్యం' అని మాటల్లో కాదు, చేతల్లో చూపించారు. 'ది వారియర్' కోసం ఆయన గాయాలను సైతం లెక్క చేయలేదు. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయినా షూటింగ్ మొదలు పెట్టారు. కాలు నొప్పి పెడుతున్నా సాంగ్‌లో స్టెప్పులు వేశారు. రామ్‌తో పాటు హీరోయిన్ కృతి శెట్టి సైతం ఈ విషయం చెప్పారు. 


రామ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా 'ది వారియర్' (The Warriorr Telugu Movie). గురువారం (జూలై 14న) విడుదల అవుతోంది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన చిత్రమిది. చిత్రీకరణ ప్రారంభించడానికి నెల రోజుల ముందు వ్యాయామాలు చేస్తుండగా... రామ్ మెడకు గాయమైంది. వైద్యుల దగ్గరకు వెళితే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అని చెప్పారు. దాంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకోక తప్పలేదు. 


మూడు నెలల తర్వాత షూటింగ్ ఆలస్యం అవుతోందని, జిమ్ చేయవచ్చా? అని వైద్యులను అడిగితే... 'లైఫ్ ఇంపార్టెంట్ ఆ? సినిమాలు ఇంపార్టెంట్ ఆ?' అని ప్రశ్నించారని... సినిమాలే లైఫ్ అనుకునే వాళ్లకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ కింద అనిపిస్తుందని రామ్ అన్నారు. అభిమానుల కోసం గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎంతో పెయిన్ ఉన్నప్పటికీ... రామ్ సాంగ్ షూటింగ్ చేశారని, అంత పెయిన్‌లోనూ ఆయన స్టెప్స్ వేస్తుంటే ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టమైందని కృతి శెట్టి పేర్కొన్నారు. 



Also Read : రామ్ (Ram) తో కచ్చితంగా సినిమా ఉంటుంది - హరీష్ శంకర్



తన బాడీలో ప్రతి ఇంచ్‌లో ఎనర్జీ అభిమానుల వల్ల వచ్చిందని... ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే పడిన కష్టం అంతా మర్చిపోయానని రామ్ తెలిపారు. ''ఇంజ్యూరీ అయిన సమయంలో చాలా రోజుల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేశా. అప్పుడు అభిమానులు పంపిన సందేశాలు ఒక్కొక్కటీ చదివా. అప్పటివరకూ సాంగ్స్, ఫైట్స్ ఎలా చేయాలని నేను ఆలోచించా. అయితే, 'అన్నా... నువ్వేం చేయకు. ఈ సినిమా నుంచి మేం ఏమీ ఆశించడం లేదు' అని ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేశారు. వాళ్ళ అన్ కండిషనల్ లవ్ చూశాక... అభిమానులు లేకపోతే నేను లేనని ఆ రోజు అర్థమైంది'' అని రామ్ ఎమోషనల్ అయ్యారు. 



'ది వారియర్' ట్రైలర్ సహా 'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఫంక్షన్‌కు రాలేదు. రీ రికార్డింగ్ చేయడంలో బిజీగా ఉన్నారని చిత్ర బృందం పేర్కొంది.  


Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు