విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఈ రోజు ఆ పాత్ర ఫస్ట్ లుక్ (Ginna Movie First Look) విడుదల చేశారు.


'జిన్నా'లో విష్ణు మంచు ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో రొటీన్‌కి భిన్నంగా, కాస్త కొత్తగా విడుదల చేశారు. షాట్ రెడీ అయ్యిందని విష్ణును ఫైట్ మాస్టర్ రామకృష్ణన్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు అందరూ పిలుస్తారు. 'విష్ణు గారు... షాట్ రెడీ' అని అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్ర పిలుస్తారు. అయితే విష్ణు మంచు రారు. తర్వాత విషయం తెలుసుకున్న ప్రేమ్ రక్షిత్ 'జిన్నా... షాట్ రెడీ' అని పిలవమని సలహా ఇస్తారు. అప్పుడు విష్ణు వస్తారు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కళ్ళజోడు పెట్టుకుని, చేతికి ఆంజనేయ స్వామి, ఓంకారం ఉన్న కడియం ధరించారు విష్ణు. 





 
ఈ సినిమాలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్నారు. ఇందులోని పాటలకు ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు


కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయనే క్రియేటివ్ ప్రొడ్యూసర్. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. 



Also Read : రామ్ (Ram) తో కచ్చితంగా సినిమా ఉంటుంది - హరీష్ శంకర్